సౌత్ సిని పరిశ్రమలో స్టార్ డైరక్టర్స్ గా చాలామంది దర్శకులే ఉన్నా కేవలం అతి తక్కువమందిఏ క్రేజ్ ఉంటుంది. అందులో చెప్పుకునే మొదటి రెండు పేర్లలో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ కూడా ఉంటాడు. తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంచే శంకర్ ఐ సినిమాతో కాస్త వెనుకడుగు వేశాడు. త్రీ ఇడియట్స్ సినిమా రీమేక్ చేసినా హిట్ అందుకున్న శంకర్ ఐతో చాలా అపవాదాలు మూటకట్టుకున్నాడు.


ఇక ప్రస్తుతం రోబో సీక్వల్ గా 2.0 సినిమా చేస్తున్నాడు శంకర్. సూపర్ స్టార్ రజినికాంత్ ను మరోసారి రోబోగా చూపించడానికి సిద్ధమైన శంకర్ సినిమాను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడట. నిన్న మొన్నటిదాకా తనకు తిరుగులేదు తనను దాటెల్లే దర్శకుడు సౌత్ లో ఎవరు ఉండరు అనుకున్న శంకర్ కు బాహుబలి మొదటి పార్ట్ తోనే సమాధానం చెప్పాడు రాజమౌళి.


ఇక రీసెంట్ గా వచ్చిన బాహుబలి-2 కన్ క్లూజన్ తో కూడా మరోసారి తన సత్తా చాటుకున్నాడు రాజమౌళి. పార్ట్ 2తో ఇండియన్ టాప్ డైరక్టర్ గా రాజమౌళి క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు శంకర్ రోబో సీక్వల్ మీద విపరీతమైన ప్రెజర్ పడిందని చెప్పాలి. రాజమౌళితో పోటీ పడగలిగిన సౌత్ ఇండియన్ డైరక్టర్ శంకర్ అంతకుమించిన సినిమమ తీస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


బాహుబలిపై అంచనాలున్నా అంతకుమించి అద్భుతాలను తెర మీద ఆవిక్షరించాడు రాజమౌళి. శంకర్ కే కాదు బాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ కు కూడా జక్కన్న తన క్రియేటివిటీ టాలెంట్ తో భయం పుట్టించాడు.     



మరింత సమాచారం తెలుసుకోండి: