Image result for kamal r khan on bahubali hd images



చాలామంది కొన్ని విషయాలని అసంధర్భంగా ఎందుకు మాట్లాడతారో అర్ధంకాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి జాతర గాళ్ళు ఉంటూనే ఉంటారు. ఊరందరిది ఒకదారయితే ఉలిపిరికట్టది మరో దారనే తరహా వ్యక్తులు కోకొల్లలు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అలాంటి వారికి అంతే లేదనుకోండి. ఇంతకీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊరంతా ఒక దారిని వెళితే ఉలిపిరి కట్టలా మరో దారి వెళ్లే వాడు ఎవరయ్యా అంటే కమల్ ఆర్ ఖాన్.  ఇతడు ఏదయినా చిత్రం విడుదల అయ్యిందంటే ఇక దాన్ని విమర్శించ డమే పనిగా జీవితాశయం గా పెట్టుకుంటాడు. ఈ మద్య విడుదలైన రాజమౌళి చిత్రం బాహుబలి 2 ని కూడా వదిలి పెట్టలేదు. అంతేకాదు ఆ సినిమాపై, కథానాయకునిపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. 


హీరో ప్రభాస్ ఈ చిత్రంలో ఒక ఒంటెలా కనిపిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలాంటి ఒంటెలా వుండే హీరో ప్రభాస్ ను ఎవరయినా బాలీవుడ్ నిర్మాతలు తీసు కుని చిత్రాన్ని తీస్తే వాళ్లంతా ఇడియట్స్ కింద మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. అసలు బాహుబలి 2 లో కథేమీ లేదనీ, గ్రాఫిక్స్ కూడా పరమ చెత్త గా చూపించారని విమర్శించాడు. 


 
రాజమౌళి ఇంత ఘోరంగా దర్శకత్వం చేస్తాడని తను అనుకోలేదని, ఇక సంగీతం కూడా పరమ దరిద్రంగా ఉన్దంటూ వ్యాఖ్యా నించాడు. "బాహుబలి 2 ది కంక్లూజన్" కంటే "బాహుబలి ది బిగినింగ్" చాలా గొప్పగా ఉందని అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డబ్బులు పోసి చూడటం వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి తన రేటింగ్ 5 కి 1 అని కూడా పేర్కొన్నాడు ఈ తలతిక్క కె ఆర్ కె.


Image result for kamal r khan on bahubali hd images

మరింత సమాచారం తెలుసుకోండి: