వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సడెన్ గా ఒక కొత్త వైరస్ తనకు సోకిందని దీనికోసం ఎటువంటి మందులు వాడాలా అన్న విషయం తన డాక్టర్లకు కూడ అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ ట్విట్ చేసాడు వర్మ. ఇంతకీ వర్మకు సోకిన ఆ వైరస్ పేరు ‘బాహుబలి 2’ జలసైటిస్ అంటున్నాడు. 
బాహుబలి-2’ ను చూసి అసూయతో రగిలిపోవడం వల్ల ఈ వ్యాధి తనకు వచ్చిందని అంటున్నాడు వర్మ. అంతేకాదు తనలాగే దేశవ్యాప్తంగా మరెందరో ఫిలిం మేకర్స్ అనేక చోట్ల ఇదే విధమైన వైరస్ తో ఆస్పత్రుల్లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. 

అంతేకాదు వర్మ ఈ విషయానికి మరొక ట్విస్ట్ ఇస్తూ ‘బాహుబలి 2’  శబ్దాన్ని తట్టుకోలేక బాలీవుడ్ డైరెక్టర్లు - హీరోలు చెవుల్లో దూది పెట్టుకున్నారని ‘బాహుబలి’ దెబ్బకు వీరంతా వణికిపోతున్నారు అంటూ మరో షాకింగ్ ట్విట్ చేసాడు వర్మ. ఈ వివాదాల దర్శకుడు చేసిన ట్విట్స్ లో కొన్ని అతిశయోక్తులు ఉన్నా ‘బాహుబలి 2’ మ్యానియాను వర్మ కామెంట్స్ తెలియచేస్తున్నాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా వాటిని ఎత్తిచూపే సాహసం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరూ చేయలేకపోతున్నారు అంటే ‘బాహుబలి 2’ సునామీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతుంది. అంతేకాదు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని కాలమానం ఉన్నట్లే ఇకపై ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేటపుడు బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని మాట్లాడుకోవాలి అని వర్మ చేస్తున్న కామెంట్స్ అనేక చర్చలకు తెర తీస్తున్నాయి.

‘బాహుబలి-2’ సాధించిన మెగా సక్సస్ ముందు ఖాన్లు, రోషన్లు, చోప్రాలు ఎగిరిపోయారు అంటూ వర్మ చేసిన కామెంట్స్ తో బాలీవుడ్ మీడియా మండి పడిపోతోంది. అంతేకాదు రాజమౌళిని కనుగొన్న కరణ్ జోహార్ కు తాను సెల్యూట్ చేస్తున్నానని ‘బాహుబలి-2’ ను ఇష్టపడ్డ ప్రేక్షకులందరూ కరణ్ జోహార్ కు పాదాభివందనం చేయాలని రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ కు అనేక చర్చలకు తెర తీస్తున్నాయి. ‘బాహుబలి 2’ సక్సస్ ను చూసి ఇప్పటి వరకు రాజమౌళి ఒక్క మాట కూడ మాట్లాడక పోయినా రాజమౌళి తరఫున ప్రతినిధిగా వర్మ పెద్ద చిచ్చునే రగిలిస్తున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: