బాహుబలి 2 ఇంటర్వల్ బ్యాంగ్ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్కషన్ లు జరుగుతున్నాయి. రాజమౌళి అసలు అంత గొప్పగా ఒక సన్నివేసం ఎలా రాసాడు అనేది బోలెడు మంది అడుగుతున్న ప్రశ్న. సీన్ టేకింగ్ లో బాహుబలి ని హై లైట్ చేస్తూ భల్లాల దేవుడు తల దించుకునేలా ఉన్న ఇంటర్వెల్ బ్యాంగ్ ఇండియన్ సినిమా చరిత్ర లోనే ఒక పెద్ద ఘట్టం అని చెప్పాలి. అసలు విజన్ కి సైతం రాని అద్భుతాలని ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో రాసారు విజయేంద్ర ప్రసాద్. భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం పై కూర్చున్న‌ప్పుడు చ‌ప్పుడు చేయ‌ని మాహీష్మ‌తీ ప్ర‌జ‌లు… సైన్యాధ్య‌క్షుడిగా బాహుబ‌లి ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ప్పుడు మాత్రం ఆవేశంగా రెచ్చిపోతారు. ఆ చ‌ప్పుళ్ల‌కు భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం సైతం క‌దిలిపోతుంది. దాంతో… రాజునయ్యా అన్న సంతృప్తి, సంతోష‌కం కూడా భ‌ళ్లాల‌దేవ క‌ళ్ల‌లో మాయం అవుతుంది. ఈ స‌న్నివేశానికి స్ఫూర్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులేన‌ట‌. ఈ విష‌యాన్ని ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాదే స్వ‌యంగా అంగీక‌రించారు. " ఒక ఆడియో ఫంక్షన్ చూసాను అందులో పవన్ పేరు చెబితే చాలు జనం వెర్రిగా రెచ్చిపోతున్నారు. పవన్ ఆ సభలో లేకపోయినా కూడా పవర్ స్టార్ అంటూ గోల చేస్తున్నారు. ఎవ్వరికీ మాట్లాడే అవకాశం కానీ ఏదీ దక్కలేదు .. ఆ సినిమా ఆడియో హీరోకి అయినా కుళ్ళు వచ్చే విధంగా ఉంది వారి హడావిడి.భ‌ళ్లాల‌దేవ పాత్ర‌లోనూ ఆ జెల‌సీ చూడాల్సిన సంద‌ర్భం బాహుబ‌లి 2 క‌థ‌లో వ‌చ్చింది. ఆ సీన్ రాస్తున్న‌ప్పుడు టీవీలో ఓ ఆడియో ఫంక్ష‌న్ . పవన్ పేరు చెబితే ఆ ఆడియో మొత్తం రచ్చ జరిగింది . దాంతో ఆ సీన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా " అన్నారు విజయేంద్ర ప్రసాద్ 



మరింత సమాచారం తెలుసుకోండి: