బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చేయాలంటే ఒక్క షారుఖ్ మాత్రమే అని అంటారు. అమీర్ ఖాన్ వంటి స్లార్స్ సైతం షారుఖ్ చేసినంతగా కమర్షియల్ చేయలేదు. ఆ విధంగా షారుఖ్ ఖాన్ కి ఇండస్ట్రీలో మంచి బిజినెస్ మెన్ గా పేరు వచ్చింది. ఒకవైపు తను సినిమాలను చేస్తూనే మరోవైపు ఎన్నో రకాల యాడ్స్ ని సైతం చేస్తున్నారు.

ఇండియాలోని అత్యధిక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కొనసాగుతున్న ఏకైక స్టార్ ఒక్క షారుఖ్ ఖాన్ మాత్రమే. మరి ఇంతటి బిజినెస్ మైండ్ ఉన్న స్టార్ కి అమీర్ ఖాన్ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. బిజినెస్ ఎలా చేయాలో అమీర్ ఇఫ్పుడు షారుఖ్ కి చూపించాడు. ఇద్దరూ ఒకే బిజినెస్ లోకి అడుగుపెట్టి…షారుఖ్ కంటే అమీర్ 400 కోట్ల రూపాయల అధిక లాభాన్ని ఆర్జించాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… రెడ్ చిల్లీస్‌లో నిర్మించిన షారుఖ్ సినిమాల్ని ఒక కార్పొరెట్ సంస్థ వంద‌ల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 54 కోట్ల రూపాయలు. దీన్ని చూసిన అమీర్ ఖాన్…ఇదే త‌ర‌హా డీల్‌ని నెట్ ప్లిక్స్ అనే మరో కంపెనీతో సెట్ చేసుకున్నాడు. ప్ర‌ఖ్యాత నెట్‌ఫ్లిక్స్ తో అమీర్ ఖాన్ కి 500 కోట్ల డీల్ ని ఆఫర్ చేసింది. అమీర్ సొంత బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించిన సినిమాల విలువ ఇది.

ల‌గాన్,తారే జ‌మీన్ ప‌ర్,దంగ‌ల్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల తో పాటు ప‌లు చిత్రాలు ఇందులో ఉన్నారు. అమీర్‌ తాజా చిత్రం `త‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` సైతం ఈ డీల్‌ లోకే వ‌చ్చింది. షారుఖ్ ఖాన్ కాస్త తొందర పడి ఇండియన్ కంపెనీతో డీల్ పెట్టుకొని తక్కువ లాభాలని చూశాడు. కానీ అమీర్ ఖాన్ మాత్రం ఇంటర్నేషనల్ కంపెనీతో డీల్ పెట్టుకొని భారీ లాభాల్ని చూశాడని అంటున్నారు. దీంతో షారుఖ్ ఒక్కసారిగా ఆశ్ఛర్యపోయాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: