భారీ సెట్టింగ్స్ తో అత్యంత భారీ సినిమాలు తీయడంలో దర్శకుడు గుణశేఖర్ డి ఒక ప్రత్యేకమైన శైలి. ఒక విధంగా ఆలోచిస్తే ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా నిర్మాణం వెనుక గుణశేఖర్ పరోక్ష హస్తం ఉంది అనే అభిప్రాయం కూడ ఉంది. దీనికి కారణం రాజమౌళి ‘బాహుబలి’ కి బదులు ముందుగా ‘రుద్రమదేవి’ సినిమాను తీయాలని అనుకున్నాడు. 

అయితే అనుకోకుండా అప్పటికే గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్ ను ప్రకటించడంతో రాజమౌళి వేరే మార్గం లేక తన ఊహలలో ఉన్న ‘బాహుబలి’ మూవీ ప్రాజెక్ట్ కు ఒకరూపం కల్పించాడు అనే మాటలు కూడ ఉన్నాయి. అయితే అటువంటి క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ అభిమానులు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం గుణశేఖర్ ‘బాహుబలి 2’ పై చేసిన కామెంట్స్.  

రాజమౌళిని అభినందిస్తూ గుణశేఖర్ కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉంది అని ప్రశంసిస్తూ గుణశేఖర్ ఒక సింపుల్ స్టోరీని ఒక అద్భుతమైన సినిమాగా మార్చిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు తాను అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు గుణశేఖర్. ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రభాస్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 

5 సంవత్సరాలపాటు ఒక మహా యజ్ఞంలా ఒక అద్భుతాన్ని తీసి చూపించిన రాజమౌళి ‘బాహుబలి’ కథ సింపుల్ స్టోరీ ఏమిటీ అంటూ ప్రభాస్ అభిమానులు గుణశేఖర్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఒక ఊహాలోకానికి తీసుకువెళ్ళిన ‘బాహుబలి’ కథ సింపుల్ స్టోరీ ఎలా అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు గుణశేఖర్ కు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. 

ఇదే సందర్భంలో గుణశేఖర్ రాజమౌళి కీరవాణిల పై ప్రశంసలు కురిపించి కనీసం ఒక్క మాట కూడా తమ అభిమాన హీరో ప్రభాస్ గురించి మాట్లాడక పోవడం కూడ ప్రభాస్ అభిమానులకు గుణశేఖర్ పై తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది అని టాక్. అయితే ‘బాహుబలి’ కథ సృష్టి కర్త విజయేంద్ర ప్రసాద్ కూడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బాహుబలి’ కథ కొత్తది కాదు అన్నదమ్ముల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉన్న కధే అయినప్పటికీ ప్రేమ – పగ – ప్రతీకారం మధ్యనే ఏ కథ అయినా ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు కూడ ప్రభాస్ అభిమానులు గ్రహించలేదా అన్నదే సందేహం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: