రిలీజ్ తర్వాత బాహుబలి-2 సంచలనాలు తెలుస్తూనే ఉన్నాయి.. మొదటి రోజే 120 కోట్ల కలక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాహుబలి కన్ క్లూజన్ మూవీ గురించి ఎంతోమంది ఎన్నోవిధాలుగా ప్రశంసలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. బాహుబలి కన్ క్లూజన్ ఓ అసాధారణమైన సినిమా.. రాజమౌళి మాత్రమే ఇలాంటి అద్భుతాలను చేయగలడు.


బాహుబలి ఓ అద్భుతమైన సినిమా.. ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు రాజమౌళికి హ్యాట్సాఫ్ అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా పరిదులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిననదుకు రాజమౌళికి తన కృతజ్ఞతలు తెలియచేశాడు చిరంజీవి.


చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ తో పాటుగా మిగతా వారందరికి ఇంకా ఈ సినిమాకు ప్రత్యేకంగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు.. సంగీతం అందించిన కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తో పాటుగా మిగతా క్రూ మొత్తానికి తన కంట్రాస్ చెప్పారు చిరు.


బాహుబలి-2 అనుకున్న విధంగానే అందరి అంచనాలను మించి సినిమా వసూళ్లను దక్కించుకుంటుంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ సిని ప్రియులందరిని వారెవా అనేలా చేస్తుంది. ప్రస్తుతం సెలబ్రిటీస్ బాహుబలి-2 గురించి మాట్లాడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: