తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ‘బాహుబలి’.  ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘బాహుబలి2 ’ ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కలెక్షన్ పరంగా ప్రభంజనం సృష్టిస్తుంది.  బాహుబలి   కన్నా బాహుబలి 2 చాలా అద్భుతంగా గ్రాఫిక్ మాయాజాలంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. బాహుబలి-ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు కొల్లకొడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  
మల్టీప్లెక్సుల్లో...
కేవలం మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరింది బాహుబలి 2. ఈ లెక్కన చూస్తుంటే అమీర్ ఖాన్ దంగల్ రికార్డులను అవలీలగా బద్దలు కొట్టడమే కాకుండా మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది బాహుబలి 2. తాజాగా అందుతున్న సమాచారం ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్ల వసూలు చేసినట్లు సమాచారం. రూ. 1000 కోట్ల మార్కును అందుకోబోతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే అని అంతా అంటున్నారు.
అంతా బడా బాబులే...
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలంలో రిలీజ్ చేసారు. అన్నికంటే ఎక్కువగా తెలుగులోనే ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , ఓవర్ సీస్ , కర్ణాటక , తమిళనాడు , ఉత్తరాది అనే తేడా లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది బాహుబలి 2. రెండు రోజుల్లోనే 217 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించిన బాహుబలి మూడో రోజు కూడా అదేజోరు ని కొనసాగించింది దాంతో బాహుబలి 2 మొదటి మూడు రోజుల్లోనే 400 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది .
అధిక ధరలు
తొలి  వీకెండ్ లోనే ఇంతటి వసూళ్ల ని సాధిస్తే రానున్న రోజుల్లో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం .ఇలాంటి అవకాశం లభించడం చాలా అరుదు. ఇంత డిమాండ్ ఉన్న సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. డిమాండ్ కు తగిన విధంగానే థియేటర్లు కావాల్సినన్ని దొరికాయి. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి లభించింది. దీంతో సాధారణం కంటే అధిక ధరలకు టికెట్స్ అమ్ముతున్నారు. దీని కారణంగా 30 శాతం వరకు అధిక రాబడి వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: