బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా గత మూడు సంవత్సరాల నుంచి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ ఈ అమ్మడిపై ఎన్నో వివాదాలు చుట్టు ముట్టినా ఏవీ పట్టించుకోవడం లేదు.  గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మ‌ళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి తన హాట్ లుక్స్ తో కాదు వెరైటీ డ్రెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Image result for priyanka Chopra Hits The Red Carpet, Twitter's Got Jokes
న్యూయార్క్‌లో జ‌రిగిన మెట్ గాలా ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా ట్రెంచ్ కోట్ డ్రెస్సులో మెరిసిపోయింది. మెట్‌గాలా కాస్ట్యూమ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌తి ఏడాది ఈ షో నిర్వ‌హిస్తున్న‌ది.  డ్రెస్‌ ముందంతా బాగానే ఉంది కానీ వెనుక మాత్రం పెద్ద దుప్పటి పరిచినట్లు ఉంది.
priyanka chopra met gala 2 650
ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రియాంక వేసుకున్న డ్రెస్ నెటిజన్లకు అంతగా నచ్చినట్లు లేదు. దాంతో ప్రియాంక వేసుకున్నడ్రెస్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది.  



- ఇది స్వచ్ఛ భారత్‌ కోసం వేసుకున్న డ్రెస్‌


- ఐపీఎల్‌ సమయంలో వర్షం పడితే మైదానం తడవకుండా ప్రియాంక డ్రెస్‌తో కప్పేయండి


- హాయ్‌ రే ఇది నా గాగ్రా..పంజాబ్‌ నుంచి ఆగ్రా మీదుగా ఢిల్లీకి తీసుకొచ్చా


- ప్రతీ ఒక్కరు ఇలాంటి డ్రస్ వేసుకుని 100 మీటర్లు నడిస్తే చాలు భారత దేశం అంతా గంటలో క్లీన్ అవుతుంది


-  ఓ మై గాడ్ శశికళా…ఎందుకు ప్రియాంకను ఆపుతున్నావు


- నీ బెడ్ షీట్ ను వేసుకుని వెళ్లు


- అమీర్ ఖాన్.. గజినీ పాటను ఈ గౌనుపైనే తీశారట


- ఊడ్చే అవార్డుల కార్యక్రమానికి ఇలాగే వెళ్తారట


- ఇల్లు ఊడ్చే గౌనంట


- లేడీ కానిస్టేబుల్ కొత్త ఫ్యాషన్ అంటూ  నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: