ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది సెలబ్రెటీలు చేస్తున్న హంగామా చూస్తుంటే..నవ్వాలో..ఏడ్వాలో తెలియడం లేదు.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు తమ సెల్ఫీ ఫోటోలతో చిత్ర విచిత్రమైన ఫోటోలు తీసుకొని అవి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి వాటికి వచ్చే లైక్స్ చూసి తెగ ముచ్చట పడుతున్నారు.  అయితే కొన్ని సార్లు ఆలాంటి పోస్టులతో ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు చేసిన వింత పని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
kyali 2
 అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ షోలో పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు అదరగొట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్ఫీ వివాదాస్పదమైంది.దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్ లోకి వెళ్లగా… కైలీ ఈ సెల్ఫీని తీసింది. వాస్తవానికి మెట్ గాల్ రూల్స్ ప్రకారం అక్కడ సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్ధం.
Image result for new jersey celebs selfie at bathroom
అలాంటిది ఇంతమంది బాత్రూమ్ లోకి దూరి సెల్ఫీ దిగడంతో షో నిర్వాహకులు ఫైర్ అవుతున్నారు.  ఈ సెల్ఫీ ఫోటో వివాదాలకు కేంద్ర బింధువైన కిమ్ కర్ధాషియన్ తో పాటు లిలి అల్ డ్రిడ్జ్, ప్యారిస్ జాక్సన్, బ్రీ లార్సన్, రాకీ, కెండల్ జెన్నర్ తదితరులు ఈ సెల్ఫీకి పోజిచ్చారు. ఈ సెల్ఫీని కైలీ జెన్నర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫొటోకు 20 లక్షల లైకులు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: