hollywud movies in usa record collections how to be a latin lover కోసం చిత్ర ఫలితం

ఊహ‌కే చిక్కకుండా ఒక రేంజ్ లో వసూళ్ళను రాబట్టుకుంటూ బాక్స్ ఆఫీసు రికార్డ్ లను బ్రద్దలు చేస్తుంది బాహుబ‌లి-2., ది కంక్లూజన్. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, రమ్యకృష్ణ, త‌మ‌న్నా, నాజ‌ర్, స‌త్య‌రాజ్ వంటి వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమా విశ్వ వ్యాప్తంగా రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. బాలీవుడ్ హీరోల‌ సినిమాలను ప్రక్కకి నెట్టి సరికొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తోంది. భార‌త్ లోనే కాకుండా, అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, యూఏఈ వంటి దేశాల్లో విడుద‌లైన ఈ సినిమా, ప్ర‌పంచ సినీ అభిమానుల‌ ను విపరీతంగా ఆక‌ట్టుకుంటోంది. భారత్ లో ఒక ప్రాంతీయ భాష తెలుగు, అదే టలీవుడ్ సినీ పరిశ్ర‌మ నుంచి వ‌చ్చిన సినిమా, ఈ రేంజ్లో వసూళ్ళను కొల్ల‌గొట్టడం ఇదే మొద‌టి సారి అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారతీయ సినిమా అంటే బాలీవుద్ అనే అందరికీ తెలుసు.

how to be a latin lover hd images కోసం చిత్ర ఫలితం

 భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ స‌గ‌ర్వంగా చెప్పుకునే ఓ అరుదైన రికార్డును బాహుబ‌లి-2 న‌మోదు చేసింది. హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా క‌లెక్ష‌న్లు సాధించి, భ‌ళిరా! సాహోరే! బాహుబ‌లి! అనిపిలిపించుకుంది. అమెరికాలో ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లోనే $ 10.35 మిలియ‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన మూడో సినిమాగా రికార్డు న‌మోదు చేసింది. మొద‌టి రెండు సినిమాలు హాలీవుడ్ కి చెందినవే.  

 bahubali 2 hd photos కోసం చిత్ర ఫలితం


"ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 8" సినిమా మూడో వారానికి $ 19.93 మిలియ‌న్ డాల‌ర్లు వసూళ్ళు చేయ‌గా, "హౌ టు బీ ఏ లాటిన్ ల‌వ‌ర్" సినిమా మొద‌టి వారాంతంలో $ 12.25 మిలియ‌న్ డాల‌ర్లు వసూళ్ళు చేసింది. దాని త‌ర్వాత మొద‌టి వీకెండ్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా బాహుబ‌లి-2 ది కంక్లూజన్ నిలిచింది. అయితే లెక్క‌ల ప్ర‌కారం బాహుబ‌లికి మూడో నెంబ‌ర్ వేసుకున్నా, లోతుగా విశ్లేషిస్తే బాహుబ‌లి స‌త్తా ఏమిటో అర్థం అవుతుంది. 

hollywud movies in usa record collections fast and furious 8 కోసం చిత్ర ఫలితం

హాలీవుడ్ సినిమా కంటే బాహుబ‌లే గ్రేట్ అనిపించే నిజం తెలుస్తుంది ఎలా అంటే:


ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సినిమా 4077 స్క్రీన్ల‌లో విడుద‌లైంది. 
హౌ టు బీ ఏ లాటిన్ ల‌వ‌ర్ సినిమా 1118 స్క్రీన్ల‌లో విడుద‌లైంది. 
బాహుబ‌లి-2 మాత్రం 425 స్క్రీన్ల‌లో విడుద‌లైంది. 

సంబంధిత చిత్రం


థియేట‌ర్ల సంఖ్య చాలా త‌క్కువ‌  మొద‌టి వారాంతం లోనే హాలీవుడ్ సినిమాల‌కు సమవుజ్జీగా రికార్డు క‌లెక్ష‌న్లు సాధించింది. ఒక "తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా" ల‌ను ప‌క్క‌కు నెట్టేయ‌డం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

bahubali 2 hd photos కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: