తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం బాహుబలి. జాతీయ స్థాయి అవార్డు కైవసం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా బాహుబలి 2 ఏప్రిల్ 28న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఇక కలెక్షన్ల పరంగా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. మొదట ఈ చిత్రం పై రక రకాల భిన్న స్వరాలు వినిపించాయి. బాలీవుడ్,శాండిల్ వుడ్ లో సినిమాకు పూర్తిగా సపోర్ట్ చేయడం మానేశారని సినిమాను వ్యతిరేకిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Image result for baahubali 2 stills
కానీ ఎంత మంది ఈ చిత్రంపై ఎన్ని కామెంట్స్ చేసినా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.  ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా బాహుబలి విజయఢంకా మోగిస్తుంది. మూడు రోజుల్లోనే 400 కలెక్షన్లు సాధించింది.వారం తిరక్కుండానే 700 కోట్ల క్లబ్ లో చేరిపోయింది . ఏప్రిల్ 28న భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజ్ అయిన బాహుబలి 2 కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది . భారతదేశ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూల్ చేసిన బాహుబలి 2 ఓవర్ సీస్ లోనూ 150 కోట్ల కు పైగా వసూల్ చేసి మొత్తంగా 700 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Image result for baahubali 2 stills

బాహుబలి 2 ఏరియాల వారీగా వసూల్ చేసిన గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయి


తెలంగాణ , ఆంధ్రప్రదేశ్        -  143 కోట్ల గ్రాస్ 
హిందీ                         -   275 కోట్లు
కర్ణాటక                        -   54 కోట్లు
తమిళనాడు                   -   48 కోట్లు
కేరళ                          -   28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా            -   11 కోట్లు
ఓవర్ సీస్                     -   145 కోట్లు
మొత్తం                        -    705 కోట్ల గ్రాస్


మరింత సమాచారం తెలుసుకోండి: