తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించి రికార్డుల మోత మోగించిన చిత్రం బాహుబలి.  ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న బాహుబలి 2 కోసం టాలీవుడ్  ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన  మోస్ట్ అవేటెడ్ మూవీ బహుబలి2  ఏప్రిల్ 28న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన ఆరు రోజులకే 792 కోట్ల భారీ వసూళ్ల ని సాధించి భారతీయ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది బాహుబలి 2. అమిర్ ఖాన్ నటించిన పీకే 743 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండేది కానీ బాహుబలి 2 అమీర్ ఖాన్ పీకే రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నమోదు చేసాడు .  

ఈ సినిమా విడుద‌లై వారం రోజులు అవుతున్న సంద‌ర్భంగా ఇప్ప‌టివ‌ర‌కు ఏయే భాష‌ల్లో ఎంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌నే విష‌యాన్ని సినీ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ వివ‌రించారు.  ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేసి, దాదాపుగా 1000కోట్ల వసూళ్లు సాధించే సినిమాగా నిలపాలి అని పక్కా వ్యూహంతో ఉన్నాడు మన రాజమౌళి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధిస్తోంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత వసూల్ చేసిందో తెలుసా ...  దాదాపు 88 కోట్ల షేర్ వసూల్ చేసి అది కూడా నాలుగు రోజుల్లోనే ఇంతటి భారీ మొత్తం రావడంతో అందరూ షాక్ అవుతున్నారు .  
Image result for baahubali 2 stills
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అందరి హీరోల అభిమానులను తన ధియేటర్లకు రప్పించుకునే చేశారు.  ఇండియాలో విడుద‌లైన అన్ని భాష‌ల్లో క‌లిపి వారం రోజుల్లో బాహుబ‌లి రూ. 700 కోట్లు వసూలు చేసింద‌ని, దీంతో తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన భార‌తీయ సినిమాగా నిలిచిందని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.
Image result for baahubali 2 stills
కేవలం ఆరు రోజులల్లోనే 700 కోట్లకు పైగా వసూల్ చేస్తే ఫుల్ రన్ లో 1200 కోట్ల నుండి 1500 కోట్లు వసూల్ చేయడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .   దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అని నిస్సందేహంగా చెప్ప‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. హిందీలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన దంగ‌ల్‌, సుల్తాన్ సినిమాల‌తో ఈ సినిమాను పోల్చుతూ ఆయ‌న ప‌లు వివ‌రాలు తెలిపారు.

బాలీవుడ్ లో టాప్ సినిమాలు :

దంగల్‌’ తొలివారం క‌లెక్ష‌న్లు రూ. 197.54 కోట్లు
‘సుల్తాన్‌’ తొమ్మిది రోజుల కలెక్ష‌న్లు రూ. 229.16 కోట్లు
‘బాహుబలి 2’ ఏడు రోజుల క‌లెక్ష‌న్లు రూ. 247 కోట్లు


బాలీవుడ్ లో ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు :

గ‌త శుక్రవారం రూ. 41 కోట్లు
 శనివారం రూ. 40.50 కోట్లు
 ఆదివారం రూ. 46.50 కోట్లు
 సోమవారం రూ. 40.25
 మంగళవారం రూ. 30 కోట్లు
 బుధవారం రూ. 26 కోట్లు
 గురువారం రూ. 22.75 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: