తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంద డైరెక్టర్ వచ్చారు..వస్తున్నారు.  నాటి తరం నుంచి నేటి తరం వరకు ఎంతో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అయితే గత కొంత కాలంగా సినిమాలు కేవలం..హీరోయిజాన్ని చూపిస్తూ..నాలుగు పాటలు, మూడు ఫైట్లు, ఓ ఐటమ్ సాంగ్ ఇదే రీతిలో కొనసాగిస్తున్నారు. అయితే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా మారిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రం తన సినిమాలు ఇందుకు భిన్నంగా తీస్తూ వచ్చారు. తన సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకు వస్తూ..అటు హీరోయిజాన్ని కూడా అద్భుతంగా చూపిస్తున్నారు.  

ఇక రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో హీరో కూడా లేకుండా కేవలం గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకునేలా చేశారు.  ఇక భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహబలి’ ఏకంగా ప్రపంచ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది.  అంతే కాదు ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా కైవసం చేసుకుంది.  ఇక బాహుబలి  సీక్వెల్ బాహుబలి 2 మరోసారి తన స్టామినా నిరూపించుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న రికార్డులు సైతం పక్కకు నేట్టేసింది.
Image result for baahubali 2 stills
కేవలం పది రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ల సాధించి సరికొత్త సంచలనం సృష్టించి మొట్ట మొదటి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది బాహుబలి 2. ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , సత్యరాజ్ లను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసి అగ్రభాగాన్ని కట్టబెట్టింది.  ఇప్పటి వరకు  ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఒక్క హిందీ చిత్రాలకు మాత్రమే ఎక్కువగా స్కోప్ ఉండేది , ఆ తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. కానీ రాజమౌళి దర్శకత్వ ప్రతిభ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది...అందుకే రాజమౌళిని ఇప్పుడు అందరూ గ్రేట్ అని పొగుడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: