ఇండియన్ సినిమాల్లో ఒక్క హిందీ చిత్రాలకు మాత్రమే ఎక్కువగా స్కోప్ ఉండేది , ఆ తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి . నిన్న మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రెండు మాసాలు..రెండు సెంటిమెంట్ల సినిమాలు..హీరోయిజాన్ని భారీగా చూపించే సినిమాలు అన్న అభిప్రాయం ఉండేది.  కానీ ఈ మద్య మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి దర్శకులు వస్తున్నారన్ని విషయం ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.  ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తుంది.
Image result for prabhas 2 postes
కేవలం పది రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ల సాధించి సరికొత్త సంచలనం సృష్టించి మొట్ట మొదటి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది బాహుబలి 2. భార‌త్ లో ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కూ రూ 800 కోట్లు క‌లెక్ట్ చేయ‌గా, విదేశాల‌లో రూ 200 కోట్లు వ‌సూలు చేసింది.. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. దీంతో సినీ ప్రముఖులు ఈ చిత్రంపై..రాజమౌళిపై ప్రశంసల  జల్లు కురిపిస్తున్నారు.  
Image result for prabhas 2 postes
ఇక ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుండటం తో ఇప్పటికే చిరంజీవి , నాగార్జున , ఎన్టీఆర్ , మహేష్ , చరణ్ లతో పాటు యావత్ చిత్ర పరిశ్రమ బాహుబలి యూనిట్ పై ముఖ్యం గా జక్కన్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాగా ఇప్పుడు ఆ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరాడు .  
Related image
ఒక ప్రాంతీయ చిత్రం ఈ స్థాయి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించినందుకు మనస్ఫూర్తిగా బాహుబలి 2 యూనిట్ ని అభినందిస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు పవన్ కళ్యాణ్ . ఐదేళ్ల కష్టానికి ఈ ప్రతిఫలం లభించిందని , రాజమౌళి , ప్రభాస్ లతో పాటు బాహుబలి చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు అంటూ కూత పెట్టాడు పవన్.

పవన్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: