టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తెరకెక్కి, ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ బాహుబలి2. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ చిత్రం రిలీజ్ కాని విధంగా అన్నీ థియోటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇండియాలోని దాదాపు 90 శాతం థియోటర్స్ లో బాహుబలి2 చిత్రం రిలీజ్ అయింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి2 ఎక్కువ దేశాలలో రిలీజ్ అయింది.


దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ భారీగా వచ్చాయి. కేవలం పది రోజుల్లోనే బాహుబలి2 మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువుగా కలెక్షన్స్ ని కొల్లగొట్టిందంటే ఇది సామన్య విజయం కాదని అంటున్నారు. అలాగే ఈ మూవీ, థియోటర్స్ వద్ద ఇంకా హంగామానాని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఈ మూవీని రిపీటెడ్ గా చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.


వీరు తాజాగా బాహుబలి2 సాధించిన కలెక్షన్స్ ని చూసి...మళ్ళీ మరోసారి సినిమాని చూడాలని కోరుకుంటున్నారు. దీంతో బాహుబలి2 కలెక్షన్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ట్రేడ్ పండిట్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రన్ టైం మొత్తంలో సాధించే కలెక్షన్స్ వివరాలను చూస్తే...ఇది దాదాపు 1580 కోట్ల వరకూ వెళ్ళనుందని అంటున్నారు.


దీంతో బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 1580 కోట్లు సాధించిన మొదటి చిత్రంగా నిలవనుంది. తెలుగు, హిందీ, ఓవర్సీస్ లో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం అందరికీ సెలవులు ఉండటంతో అందరూ బాహుబలి2ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే బాహుబలి2 మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇక బాహుబలి2 టీం ప్రస్తుతం ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: