Image result for ramya krishnan as sivagami a legendary action


బాహుబలి అనగానే తక్షణం గుర్తుకు వచ్చే పాత్ర రాజమాత శివగామి. ఆ పాత్రకు కావలసినంత రాజసం అంతకు మించి పాలనలో మెళుకువలు జొప్పించ గల నేర్పు అదే చాణక్య కౌశలంతో కూడిన విజ్ఞత, అవసర మైతే అదే రేంజ్ లో ఏస్థాయి లోనైనా కౌటిల్యం ప్రదర్శించగల నైపుణ్యం ఆ పాత్ర స్వంతం. నిజంగా చెప్పా లంటే ఆమెను చాణక్యురాలు అనవచ్చు. అదృష్ఠ వశాత్తు ఆ పాత్రకు రాజమౌళి తొలుత అనుకున్న అందాల తార ఎంపిక జరగకపోవటం ఆ సినిమా ప్రారంభించిన ముహూర్తబలమే నని చెప్పవచ్చు. రమ్యకృష్ణ రసవత్త రంగా అతి  సునాయాసంగా ఆ పాత్రను రక్తిగట్టించింది.


సామంతులు అందరూ కలసి కుట్రపన్ని మాహిష్మతిని చిన్నాభిన్నం చేసి తలా ఒక ముక్క పంచుకోవాలని చూసినప్పుడు చురకత్తితో చురకత్తిలా మెరుపు వేగం తో  కదలి వారిని ఖతం చేసిన ఆ నేర్పు అంత బలీయమైన మెలుకువ, ఆ చైతన్యం, ఆ స్పూర్తి బాహుబలి రెండో భాగం శివగామిలో జావగారి పోయింది.


Image result for ramya krishnan as sivagami a legendary action


కన్నకొడుకులో కంటే పెంచిన కొడుకులో రాజ్యాన్ని సమర్ధవంతం గా నడిపించగల నాయకత్వ పటిమను గుర్తించగలిగిన మాతృమూర్తి, అదీ 25 సంవత్సరాల పాలనా నుభవాన్ని పుణికి పుచ్చుకున్న తరవాత, అదే మనసుతో బాహుబలిని అంతం చేయమని చెప్పగలదా?  అంత బీరువైన మాతృమూర్తా బాహుబలి తల్లి!  సారీ! రాజమౌళి గారి శివగామి.


రాజమౌళి - అంత బలమైన అంతకంటే సున్నితమైన మరింత హృద్యమమైన శివగామి పాత్రను అదే టెంపో తో బాహుబలి 2 లో ఎందుకు నడిపించలేక పోయారు?  పాత్రలన్నీ గ్రాఫిక్స్ ఉధృతిలో కాగితపుపడవల్లా కొట్టు కు పోయాయనిపించింది.


Image result for ramya krishnan as sivagami a legendary action


బాహుబలి దేవసేనను ప్రేమించాడని తెలిస్తేనే, పెంచిన ప్రేమ పెల్లుబకవలసిన ఆ మాతృముర్తిలో, క్రౌర్యం పెల్లుబకటం జనాల కంతగా రుచించ లేదనే కంటే వారి మనసులను చేరలేదనే చెప్పవచ్చు. భళ్ళాల కిచ్చిన మాట కోసం ఏ తెలివైన, రాజసం వెదజిల్లే రాజమాత, అత్యంత పాలనా సామర్ధ్యమున్న యువరాజు బాహుబలి ని బలిచేయదు.


అయినా బళ్ళాళుని ఆయన తండ్రి బిజ్జల దేవ మాటను ఏ పరిస్థితుల్లోనైనా విశ్వసించదు. విశ్వసించ కూడదు.ఔచిత్యం దక్కాలంటే అంతకు మించిన వ్యూహం సృష్ఠించ వలసి ఉంది. తగినంత సృజన ఉన్న రాజమౌళి ఎందుకు వ్యూహాత్మక కథను నిర్మించ లేదు. ఏమైంది రాజమౌళికి?  దృశ్యాల వెల్లువలో, వరదలో ప్రజలు పట్టించు కోలేదు కాని 1000 కోట్ల రూపాయల వసూళ్ళ తరవాత, ప్రజల నుండి, విజ్ఞులైన క్రిటిక్స్ నుండి ఎన్నో సవాళ్ళు రాజమౌళి ఎదు ర్కోవలసిన కాలం ముందుంది.   


Image result for ramya krishnan as sivagami a legendary action with devasena


ఈ తరానికి తెలియదు గాని శివగామి తన కొడుకును కట్టప్ప చంపి వార్త తెచ్చినప్పుడు కట్టప్ప చూపిన వేదన, ఆద్రత, కళ్ళలో పెల్లుబకాల్సిన కన్నీరు, హృదయంలో చెమ్మ - రమ్యకృష్ణలాంటి మహానటికి అవకాశమిస్తే కళ్ళ తొనే, హావ భావాల తోనే చెడుగుడు ఆడించి ఉండేవారు.


శ్రిదేవి ఈ పాత్ర చేసి ఉంటే రాజమౌళి కొంత అలసటతో, మరికొంత వత్తిడితో, ఇంకొంత నిర్లక్ష్యంతో వదిలేసిన శివగామి పాత్ర మరీ తేలిపోయి నిర్వీర్యమై ఉండేది. రమ్యకృష్ణ శివగామి పాత్రలో ఇమిడిపోయి అంత తేలికగా ప్రేక్షకుల వ్యాఖ్యలకు దూరం పెట్టించిందనే చెప్పాలి. 


Image result for ramya krishnan as sivagami a legendary action with devasena

మరింత సమాచారం తెలుసుకోండి: