ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం కొనసాగుతున్నే ఉన్నది. ఇప్పటికే వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించి భారత దేశంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పలు రకాల హీరోల ఫ్యాన్స్ ఆగడాలకు హద్దు లేకుండా పోతున్నాయి.   గత కొంత కాలంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న ట్విట్స్ పై హీరోల ఫ్యాన్స్ ఏ రకంగా ఫైర్ అవుతున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  
Image result for baahubali 2 1000 crores
బాలీవుడ్‌లో సూపర్ స్టార్లు అనే జబ్బలు చరుచుకునే ఖాన్ త్రయం, కపూర్ వంశ హీరోలకు సాధ్యం కాని రూ.1000 కోట్ల కలెక్షన్లను బాహుబలి2 కొల్లగొట్టింది. వందేళ్ల సినిమా చరిత్రను తెలుగు వాళ్లు తిరుగరాశారు.  ఇక తెలుగు ఇండస్ట్రీ సెలబ్రెటీస్ కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  ఆ సందర్భానని పురస్కరించుకొని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.  అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

పవన్‌పై అభ్యంతరకమైన వ్యాఖ్యలు అయితే పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ‘పవన్ కల్యాణ్' అనే ఫేక్ అకౌంట్‌ ఆసరాగా చేసుకొని తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.  ‘పవన్ కల్యాణ్.. 1000 కోట్లు వస్తే గానీ ట్వీట్ చేయవా రా లుచ్చా నయాలా అంటూ ట్వీట్ చేయడం షాక్ గురిచేసింది.  


అంతే కాదు మరో అడుగు ముందుకు వేసి   పావలా ఫ్యాన్స్ రేపు వచ్చి కలెక్షన్లు మా వల్లే అంటారు. మీ ముఖాలకు సినిమా హిట్ చేసుకొనే గతి లేదు పావలా నాయల్లారా అంటూ దూషించడం వివాదాస్పదమైంది. ఈ ట్వీట్లన్నీ పవన్ కల్యాణ్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ నుంచే రావడం గమనార్హం.

అయితే దీనిపై స్పందించిన పవన్ ఫ్యాన్స్ ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇచ్చారు.  మీకు కులగజ్జి.. పవన్ కల్యాణ్‌ను దూషిస్తూ చేసిన ట్వీట్‌పై పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. మీకు కులగజ్టి ఎక్కువైంది. ఒకవేళ మేము కూడా ఇదేలా స్పందిస్తే మీ హీరో తట్టుకోలేడు అని హెచ్చరించారు.   ఆ మద్య వర్మకు ఏకంగా శ్రద్దాంజలి ఘటిస్తూ ఫోటో క్రియేట్ చేసి మరీ ట్విట్టర్ లో పెట్టారు.  

Image result for pawan kalyan baahubali


మరింత సమాచారం తెలుసుకోండి: