హీరో అంటూ కామెడీ స్టైల్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన సంపూర్ణేష్ బాబు పై ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ హీరో  ఓ టాప్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. ‘హృదయకాలేయం’ చిత్రంతో హీరోగా పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు...ఇప్పుడు‘కొబ్బరిమట్ట’ అనే సినిమాని చేస్తున్నాడు.

తన మొదటి మూవీకి ఎంత పేరు అయితే వచ్చిందో...దాని కంటే కొబ్బరి మట్ట మరింత పేరుని తెస్తుందని సంపూర్ణేష్ బాబు భావిస్తున్నారు. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు రిలీజ్ చేసిన కొబ్బరిమట్ట టీజర్, ట్రైలర్ లకు పబ్లిక్ లో మంచి ఫన్ రియాక్షన్ వస్తుంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన క్రేజీ హీరోయిన్ తో సంపూర్ణేష్ బాబు డేటింగ్ చేస్తున్నాడనే న్యూస్ అంతటా వినిపిస్తుంది.

ఇప్పటికే సంపూర్ణేష్ బాబు ఆ క్రేజీ హీరోయిన్ మాయలో పడ్డాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్. ఈ మధ్య సంపూర్ణేష్ బాబు ఎక్కువుగా సంపాదించటంతో కొద్దిగా జల్సాలకి అలవాటు పడ్డాడనేది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్స్. ఇక కొబ్బరి మట్ట మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు.

ఏడుగురు భార్యలు, పన్నెండు మంది పిల్లలు, 40 మంది మనవలు, మానవరాళ్లతో నిండిన ఒక పెద్ద కుటుంబ కథా చిత్రంగా ఇది తెరకెక్కిందని అంటున్నారు.  మొత్తంగా సంపూర్ణేష్ బాబు సైతం హీరోయిన్స్ మోజులోకి వెళ్ళారనే న్యూస్ బయటకు రావటంతో ఇండస్ట్రీ ఇది హాట్ టాక్స్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: