బాహుబలి అనే హెడ్డింగ్ పెట్టి లోపల ఏది రాసినా ఆ హెడింగ్ పక్కన తోక ఏది తగిలించినా జనం ఎగబడి , విరగబడి చూస్తున్నారు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఈ సినిమా క్రేజ్ ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో అన్ని రకాలుగా వాడేసుకుంటూ ఉన్నారు బిజినెస్ జనాలు. క్రికెట్ - సినిమా ఈ రెండింటినీ ఎలా వాడాలో మనదేశం లో తెలిసినట్టు గా బహుసా మరెవ్వరికీ తెలీదు అనే చెప్ప్పాలి. బాహుబలి సీరీస్ దెబ్బతో జీవితాలు మార్చేసుకున్న టెక్నీషియన్ లూ సాంకేతిక నిపుణులూ ఎందరినో మనం చూస్తూ ఉన్నాం.


క‌థా ర‌చ‌యిత‌గా అప్పుడే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇండియా వైడ్ గా పాపుల‌ర్ అయిపోయాడు. భ‌జ‌రంగీ భాయ్ జాన్ కూడా.. సూప‌ర్ హిట్ కావ‌డంతో బాలీవుడ్‌లోనూ విజ‌యేంద్ర ప్ర‌సాద్ పేరు మార్మోగుతోంది. కెమెరామెన్ సింథిల్‌కి ఇప్పుడు బాలీవుడ్ త‌లుపులు తెర‌వ‌డం ఖాయం. ఈ సినిమాకి సంగీతం అందించిన కీర‌వాణి కి బాలీవుడ్‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.


ఇప్పుడు మ‌రింత విరివిగా అక్క‌డి నుంచి అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇలా చాలామంది కెరీర్‌కి బాహుబ‌లి అద్భుత‌మైన ఫ్లాట్ ఫామ్ వేసింది. దాన్ని నిలుపుకొని.. స‌ద్వినియోగం చేసుకొనేదెవ‌రో కాల‌మే చెప్పాలి. బాహుబ‌లి పేరు చెప్పి పారితోషికాలు పిండేద్దాం అనుకొంటే పొర‌పాటే.. బాహుబ‌లి గౌర‌వ‌మే కాదు, బాధ్య‌త కూడా. దాన్ని వీలైనంత గౌర‌వంగా… భ‌ద్రంగా కాపాడుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: