తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా తర్వాత నటించిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేదు.  దాంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించింది.  ఈ చిత్రంలో ప్రభాస్ తో నటించిన రొమాంటిక్ సన్నివేశాలు, యుద్ద సన్నివేశంలో ఆమె వీర నారీమణిగా చాలా అద్భుతంగా చూపించారు.   అయితే మొదటి పార్ట్ లో తమన్నాకు సంబంధించి కీలకమైన పాత్ర కనుక చాలా వరకు కవర్ చేశారు.  
Image result for avantika tamanna
ఇక బాహుబలికి సీక్వెల్ బాహుబలి 2 లో తమన్నా క్లయిమాక్స్ సీన్లో మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఒకటీ రెండు సార్లు మాత్రమే. వాస్తవానికి బాహుబలి లో క్లయిమాక్స్ లో తమన్నా కు సంబంధించి ముఖ్య సన్నివేశాలు చాలా ఉన్నా..అవి ఏవీ చూపించలేదట. ఎంతో రిస్క్ తీసుకొని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తే తీరా సినిమా రిలీజ్ అయ్యాక తమన్నా నటించిన యాక్షన్ సన్నివేశాలు తొలగించడం తో పాటు తన పాత్ర అసలు లేనట్లుగానే ఉండటంతో తమన్నాకు అసహనంలో ఉందట.
Related image
అంతే కాదు పుండు మీద కారం చల్లినట్లు తమన్నా ఫ్యాన్స్ , అలాగే సన్నిహితులు కూడా పదేపదే బాహుబలి 2 లో నీ పాత్ర ఏంటి ? అసలు నీకు అందులో పాత్ర ఉందా ? మొత్తం అనుష్క పాత్రనే ఎక్కువ ఉంది. అసలు ఈ సినిమాలో నువ్వు ఉన్నావా..? లేవా..? అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉందట తమన్నా. ఫ్యాన్స్ కానీ , సన్నిహితులు కానీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తెగ ఇబ్బంది పడుతోందట తమన్నా. దాంతో తమన్నా ఫ్యాన్స్ తో పాటు తమన్నా కూడా దర్శకధీరుడిపై ఆగ్రహంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: