దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘బాహుబలి-2’ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ లను బద్దలు కొట్టి...ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. దీంతో రాజమౌళి పేరు ఇంటర్నేషనల్ గా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే  ఈ మూవీ తరువాత రాజమౌళి...సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీయాలని చూశాడు.

ఇప్పటికే కోలీవుడ్ లో రాజమౌళి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వినబడుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు సైతం భారీగా ఇన్వెస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో-2 చేస్తున్న రజనీకాంత్ తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారని అంటున్నారు.

ఇప్పటి వరకూ అంతా బాగున్నప్పటికీ..తాజా సమాచారం మాత్రం రాజమౌళి-రజనీకాంత్ ల కాంబినేషన్ ఆగిపోయిందని అంటున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయనేది కోలీవుడ్ మీడియాలో స్పష్టంగా వినిపిస్తున్న మాట. వీటి వివరాలను చూస్తే.. రాజమౌళి సినిమా అంటే హీరోని పూర్తిగా ఉపయోగించుకోవటమే అని అంటారు. ముఖ్యంగా హీరోతో కొన్ని రిస్కీ షాట్స్ ని చేయిస్తాడు. హీరోకి అది కష్టం అనిపించినా కచ్ఛితంగా చేయాల్సిందే అని రాజమౌళి పంతం పడుతుంటారు.

అలాగే హీరోకి ఉన్న క్రేజ్ తో సంబంధం లేకుండా తన కథ  ప్రకారం హీరో నటించాల్సి ఉంటుంది. దీని కారణంగా రజనీకాంత్ తన క్రేజ్ ని పక్కన పెట్టి రాజమౌళి మూవీలో నటించాలి. దీనికి రజనీకాంత్ సిద్ధంగా ఉండడు. ఈ తరహా ఆలోచనలు ఉన్న రాజమౌళి తో రజనీకాంత్ పనిచేయటం అనేది చాలా కష్టం. రజనీకాంత్ మాత్రం రాజమౌళి తో పనిచేసేది లేదనేది స్పష్టంగా చెప్పినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: