కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కి స్టార్ హీరో ప్రభాస్ షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రం ప్రస్తుతం అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. ఏపి, తెలంగాణల్లో ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొట్టిందో...అంతే స్థాయిలో బాహుబలి2 తమిళనాడులోనూ సత్తాచాటుతుంది.


తమిళనాడులో ఇప్పటి వరకూ బాహుబలి2 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. దీంతో బాహుబలి2 కారణంగా తమిళనాడులోని పలువురి హీరోల రికార్డ్ లు అన్నీ బ్రేక్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ కమల్ హాసన్ పై పడనుందని అంటున్నారు. దీనిపై కోలీవుడ్ లో వినిపిస్తున్న వివరాలను చూస్తే...బాహుబలి2 తమిళ స్టార్ హీరోల రికార్డుల్ని బద్దలుకొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.


ఈ మూవీ మొదటి 13 రోజులకు90 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 16 రోజులకి  100 కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఒక తెలుగు సినిమా తమిళనాట 100 కోట్ల కలెక్షన్ ని నమోదు చేయడం ఇదే మొదటి సారి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ తర్వాత మొదటి 16 రోజుల్లో 100 కోట్లు టచ్ చేసిన సినిమా బాహులి2నే. ఇదిలా ఉంటే త్వరలో కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సీక్వెల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.


ఈ మూవీపై కోలీవుడ్ మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ బాహుబలి2 రేంజ్ లో కలెక్షన్స్ ని కొల్లగొట్టడం కాస్త కష్టమే అని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇక బాహుబలి2 కలెక్షన్స్ ని చూసిన కమల్ హాసన్ కాస్త షాక్ అయ్యాడని అంటున్నారు. బాహుబలి2కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావటం అనేది నిజంగా నమ్మలేకపోతున్నాం అంటూ స్వయంగా కమల్ హాసన్ కామెంట్ చేయటం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: