తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ వారుసలు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో చాలా కొద్ది మందినే అదృష్టం వరిస్తుంది.  ఇక సరైన కథలు లేకపోవడం..బ్యాగ్ గ్రౌండ్ ప్రభావం చూపడం ఇలా కొంత మంది ఇండస్ట్రీలో నటులుగా రాణించలేక పోతున్నారు.  అయితే ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా తమ టాలెంట్ తో స్టార్ హీరోలకు ధీటుగా చాన్సులు కొట్టేస్తున్న హీరోలు కూడా ఉన్నారు.  తాజాగా పెళ్లిచూపులు లాంటి సినిమాతో ఒక్కసారే  స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో దేవరకొండ విజయ్.  
Image result for mahanati
ఈ సంవత్సరం ‘ద్వారక’ సినిమాతో మరో హిట్ కొట్టాడు.  తాజాగా మనోడు మరో లక్కీ చాన్స్ కొట్టాడు..సమంత మహానటి చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో సమంత పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ లవర్ గా నటించనుంది . మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా '' మహానటి '' చిత్రం రూపొందనుంది .
Related image
అగ్ర నిర్మాత అశ్వినీదత్ అల్లుడు నాగ అశ్విన్ ఈ మహానటి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ అశ్విన్ . మహానటి సావిత్రి బయోపిక్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంతో సావిత్రి అభిమానులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: