తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్ తో కుర్రకారు మతులు పొగొట్టిన అనుష్క అగ్ర హీరోల అందరి సరసన నటించింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు దాదాపు అన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  అంతే కాదు అనుష్క ఇప్పటి వరకు ఎవరూ చేయని కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.   కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ అల్ టైమ్ హిట్ అనే చెప్పొచ్చు.  ఇక రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి సినిమాల్లో డిఫరెంట్ యాంగిల్ లో కనిపించింది.  
Image result for arundhati
ఒక్క విషయంలో చెప్పాలంటే..డేరింగ్ రోల్స్ చేయడంలో టాలీవుడ్లో ఆమెకి పోటీ ఎవ్వరు లేరని నిరూపించుకుంది. బాహుబలి2 లో అనుష్క యువరాణి దేవసేనగా మెప్పించింది.  తాజాగా అనుష్క పెళ్లి విషయంపై రక రకాల రూమర్లు  టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క, ప్రభాస్ తో పెళ్లికి సిదమిందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సందడి చేస్తున్నాయి.  
Image result for size zero
అంతే కాదు ఈ అమ్మడు ఆ మద్య ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు..ఓ అగ్ర నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు రక రకాలుగా వార్తలు వచ్చాయి.  అంతే కాదు అనుష్క, హీరో ఆర్యతో, రానా తో షికార్లు తిరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే  తన వ్యక్తిగత విషయాలు బయటకి రావడానికి కారణం ఎవరా అని నిఘా పెట్టి బొమ్మళి.  ఇక అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయిందట.  ఇంటి దొంగను పట్టుకోలేరు అన్నట్లుగా అనుష్క దగ్గర పనిచేసే సహాయకుడే అని తెలిసింది. దాంతో అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పని నుంచి తొలగించిందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: