టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ సమంత. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సమంతకి మంచి అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్ లోని నెంబర్ వన్ గేమ్ లో సమంత కూడ పోటీ పడటం చూడవచ్చు. ఇదిలా ఉంటే సమంత కి తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ ఇచ్చింది.

దీంతో సమంత ఒక్కసారిగా తను ఒప్పుకున్న సినిమాలపై జరిగిన తప్పేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...కోలీవుడ్ స్థార్ హీరో విజయ్ తన 61వ సినిమాను అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇక తన ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.

ఈ మూవీ మొదటి హీరోయిన్ గా నిత్యా మీనన్, రెండవ హీరోయిన్ గా కాజల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోయిన్స్ తో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే మూడవ హీరోయిన్ గా ఉన్న సమంత పై చిత్రీకరణ జరగనుందని అంటున్నారు. అయితే విజయ్ మూవీలో సమంత మూడవ హీరోయిన్ గా చేస్తుండటంతో...ఇంకొంత మంది హీరోలు సమంతని వారి చిత్రాల్లో రెండో హీరోయిన్ గా ఆఫర్స్ ఇస్తున్నారు.

దీంతో కోపం వచ్చిన సమంత...తనకి ఎందుకు ఇలాంటి సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ ఇస్తున్నారు? అనేది అడిగారు. దీంతో ఓ హీరో తనకి కోలీవుడ్ మార్కెట్ లో డిమాండ్ లేదని చెప్పటంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ షాక్ అయింది. మొత్తంగా సమంత కి పెళ్లి ఫిక్స్ కావటంతో చాలా మంది హీరోలు ఈ బ్యూటికి కాస్త దూరంగా పెడుతున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: