తెలుగు ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన బాహుబలి 2 ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేసుకుంటుంది.  ఇప్పటికే ఈ సినిమా 13 వందల కోట్ల క్లబ్ లో చేరి 15 వందల కోట్ల వైపు పరుగులు పెడుతుంది.  యావత్ భారత దేశం బాహుబలి 2 కి ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే..ఒక్క బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మాత్రం ఈ సినిమా రివ్యూ చాలా చెత్తగా ఉందని తెలిపాడు.  
KRK
అంతే కాదు దర్శకులు రాజమౌళి, హీరో ప్రభాస్ పై కూడా సంచలన కామెంట్స్ చేశాడు.  దీంతో సోషల్ మీడియాలో కమాల్ ఆర్ ఖాన్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు స్పందించాడు.  వాస్తవానికి బాహుబలి 2 నాకు నచ్చలేదు..కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  అందుకే వాళ్ళ కోరిక మేరకు రాజమౌళి కి క్షమాపణ చెబుతున్నాను అంటూ సోషల్ మీడియా సాక్షిగా సారీ చెప్పాడు కమాల్ ఆర్ ఖాన్ .
A still from Baahubali 2 (L) and Kamaal R Khan
 గతంలో పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం చాలా చండాలంగా ఉందని పవన్ కి అస్సలు నటన రాదని అన్నారు.  అంతే కాదు రానా ను ఇడియట్ అని తిట్టాడు..ఇలా రక రకాలుగా కమల్ ఆర్ ఖాన్ సంచలనాలు సృష్టించి మొత్తానికి రాజమౌళికి క్షమాపణలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: