హాలీవుడ్ సినిమా ఛాన్స్ అంటే మాములు విషయం కాదు.. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న ప్రియాంకాకు అనుకోకుండా హాలీవుడ్ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. క్వాంటికో సీరీస్ లో రెచ్చిపోయిన పిసి అక్కడి ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆ క్రేజ్ తోనే హాలీవుడ్ సినిమా బేవాచ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.


బేవాచ్ అంటేనే బీచ్ లో బికిని అమ్మాయిలని మీనింగ్.. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయుంటారో అర్ధం చేసుకోవచ్చు. బేవాచ్ లో ప్రియాంకా ఎలా ఉండబోతుంది అని ఓ శాంపిల్ వదిలారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకరకాల బీచ్ లలో బికిని స్టిల్ ఇస్తుంది ప్రియాంకా.


అక్కడ తీసిన ఓ హాట్ బికిని స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రీసెంట్ గా ప్రీమియర్ షో చూసిన చిత్రయూనిట్ ప్రియాంకా నటన గురించి ప్రశంసలు కురిపించారు. మరి బేవాచ్ లో ప్రియాంకా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. హాలీవుడ్ ఫ్లాట్ ఫాంను వాడుకుని క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న పిసి అక్కడ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు శృతిమించుతుందని అంటున్నారు.


దీపికా హాలీవుడ్ ఎంట్రీ ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే తన అవకాశాన్ని అన్నివిధాలుగా సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని చూస్తుంది ప్రియాంకా చోప్రా. అందుకే ఈ రేంజ్ బికిని షో చేస్తుందని తెలుస్తుంది. మరి పిసికి హాలీవుడ్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలంటే మే 25న సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: