ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య-సమంతల కాంబినేషన్ గురించి హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత అందరూ వీరిద్దరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా నాగచైతన్యకి సంబంధించిన ఓ విషయంలో సమంత సీరియస్ అయ్యారని అంటున్నారు. అంతే కాకుండా నాగచైతన్య కోరికకు సమంత నో చెప్పిందని అంటున్నారు.


వీటికి సంబంధించిన వివరాలను చూస్తే…నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లు, టీజర్ లు సినిమా పై మార్కెట్ వర్గాల్లోనూ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మూవీని మే 26న రిలీజ్ చేస్తున్నారు.


రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటంతో 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ ఆడియో వేడుకని గ్రాండ్ గా జరపనున్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం…స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆడియో ఫంక్షన్ ని జరుపుకుంటుంది. ఈ సెంటిమెంట్ ని బలంగా నమ్ముతున్న నాగచైతన్య….‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ ఆడియో వేడుకకి సమంతను హాజరుకావాల్సిందిగా కోరాడు.


కానీ అందుకు సమంత నో అని చెప్పిందట. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీలో నాగచైతన్య-రకుల్ ప్రీత్ ల జంటకి మంచి పేరు రావటంతో ఈ కెమిస్ట్రీని ఆడియో ఫంక్షన్ లో చూడకుండా ఉండటమే బెటర్ అని సమంత ఫీలింగ్. అందుకే నాగచైతన్య కోరిక ఈ కోరికకు సమంత నో చెప్పటంతో ఇది హాట్ టాక్స్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: