తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ డీసెంట్ మూవీతో ఎంట్రి ఇచ్చిన రానా మంచి పేరుని సంపాదించుకున్నాడు. అయితే తరువాత కొన్ని సినిమాల వరకూ అందరి హీరోలలాగే కమర్షియల్ ఫార్మెట్ చిత్రాలను ప్రయత్నించాడు. కానీ తన ఫిజిక్ కి ఆ చిత్రాలు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో కమర్షియల్ చిత్రాలకి బ్రేక్ చెప్పి…కథలో కొత్తదనం, తన పాత్రలో సరికొత్తదనం ఉండే విధంగా చూసుకున్నాడు.


మొదట్లో సినిమాలు తక్కువుగా వచ్చినప్పటికీ..తను చేసేది ఒక్క సినిమా అయినా మంచి పేరుని తెచ్చిపెట్టేవిధంగా చూసుకున్నాడు. దీంతో కోలీవుడ్,బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రానాకి మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా బాహుబలి సిరీస్ కారణంగా రానా కి ఎక్కడలేని పేరు వచ్చింది. దీంతో రానా ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు.


టాలీవుడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏ హీరోకి లేని గుర్తింపు ఒక్క రానా కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు రానా చిత్రాలు అంటే నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతాయి. ప్రతి సినీ ప్రేక్షకుడు రానాని గుర్తుపెట్టుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా రానా మార్కెట్ వాల్యూ పెరిగింది. ప్రస్తుతం రానా ఏమూవీ చేసినా అది ఇండియా మొత్తంగా రిలీజ్ అవుతుంది. అంతేస్థాయిలో మార్కెట్ అవుతుంది.


ఇంకేముంది తన మార్కెట్ వాల్యూ పెరగటంతో 50 కోట్ల బడ్జెట్ ఉన్న మూవీలలో రానా రెమ్యునరేషన్ దాదాపు 8 కోట్ల రూపాయలుగా…అలాగే 80 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న చిత్రాలకి రానా 10 కోట్ల రూపాయలుగా తీసుకుంటున్నారు. ఇక ఈ రెమ్యునరేషన్ కి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లే షాక్ అవుతున్నారని అంటున్నారు. తాజాగా కన్నడ దర్శకుడు ఏఎంఆర్ రమేష్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నైపథ్యంలో ఒక థ్రిల్లర్ సినిమాను చేయనున్నారట. అందులో సీబీఐ ఆఫీసర్ డిఆర్. కార్తికేయన్ పాత్రను రానా చేయనున్నాడని, ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: