టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసులో ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు భారీ చిత్రాల్లో నటిస్తుంది. ఒకప్పుడు చిన్న సినిమాలకే పరిమితం అయిన ఈ బ్యూటీ ఒక్కసారిగా స్టార్ హీరోల కాంబినేషన్ ని మాత్రమే చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన స్పైడర్ సినిమాలో నటిస్తుంది.

ఇది కాకుండా రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్ట్ కి రెడీ అవుతుంది. అలాగే అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలతో మూవీలను చేస్తుంది. కొన్ని ఇప్పటికే షూటింగ్స్ ని జరుపుకోగా మరికొన్ని అండర్ ప్రొగ్రెస్ లో ఉన్నాయి. ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ బ్యూటి తాజాగా కొన్ని వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకొచ్చింది.

టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్న కారణంగా ఇక్కడ ఉండటానికి ఇబ్బంది ఎదురవుతుందట. దీంతో ఓ ఇంటిని హైదరాబాద్ లో కొనుక్కుంది. దీనిపై వస్తున్న రూమర్స్ కి బ్రేక్ ఇచ్చి…తనకి ఇష్టమైన హీరో బాలీవుడ్ కి చెందిన రణ్ వీర్ సింగ్ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ తో తను హీరోయిన్ గా చేయటానికి పలుసార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ…ఆ ప్రయత్నాలు అంతటా ఫలించటం లేదు. కానీ భవిష్యత్ లో ఏ హీరోతో అయిన డేటింగ్ చేయాలనిపిస్తే మాత్రం కచ్ఛితంగా రణ్ వీర్ సింగ్ తోనే చేస్తాను అని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలో ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ముద్దు సీన్స్ ని డైరెక్ట్ గా ఇవ్వాలంటే ఒక్క రణ్ వీర్ సింగ్ తోనే అని ఈ బ్యూటీ ఓపెన్ గా చెప్పుకుంటుంది. మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ ఊపుని చూస్తుంటే...ఏదొక రోజు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తుందని అంటున్నారు. అందుకోసమే రణ్ వీర్ సింగ్ ని తెగ పొగిడేస్తుందని అంటున్నారు. ఇక ఈ బ్యూటీ కోరికని రణ్ వీర్ సింగ్ త్వరగా తీర్చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: