సౌత్ ఇండియా స్టార్ హీరో ధనుష్ తో నటించాలని ప్రతి హీరోయిన్ కి ఉంటుంది. ఆ విధంగానే చాలా మంది హీరోయిన్స్ ధనుష్ ని ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఇదిలా ఉంటే ధనుష్ సైతం టాప్ హీరోయిన్స్ తో జతకట్టేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు.


అయితే తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఎక్కువ మంది హీరోయిన్స్ ధనుష్ తో డేటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే విషయం బయటకు వస్తుంది. టాప్ హీరోయిన్స్ నుండి కొత్త హీరోయిన్స్ వరకూ అందరూ ధనుష్ తో రిలేషన్ కి ఇష్టపడతారంట. ధనుష్ హీరోయిన్స్ కి ఇచ్చే ప్రముఖ్యత, సౌకర్యాలు ఏ హీరో వద్ద ఉండవని అంటారు. అందుకే ప్రతి హీరో ధనుష్ కి డేటింగ్ ఆఫర్స్ ఇస్తారని అంటున్నారు.


అయితే ధనుష్ తో ఎక్కువ సార్లు డేటింగ్ చేసినవారిలో హీరోయిన్స్ తో పాటు సింగర్స్ కూడ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా ధనుష్ తో బాగా క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ లో త్రిష, నయనతార ఒకరు అని అంటున్నారు. ఆ తరువాత స్థానంలో అమలాపాల్, అక్షరహాసన్ ఉన్నారని అంటారు. ఇక ధనుష్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీల విషయానికి వస్తే… ధనుష్ హాలీవుడ్ లో ఓ మూవీని చేస్తున్నారు.


రొమైన్ పుయెర్టోలా రాసిన ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. కెన్ స్కాట్ డైరెక్ట్ చేస్తునం ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ తాజాగా ముంబైలో మొదలైంది. ఇక ఈ మూవీ తరువాత డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ధనుష్ ఓ మూవీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: