బాలీవుడ్ కండల వీరుడిగానే కాకుండా స్పీడ్ డాన్సర్ గా పేరుపొందిన హృతిక్ రోషన్ ఇప్పుడు బాహుబలి2 కలెక్షన్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కామెంట్స్ హాట్ టాక్స్ గా మారాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఇండియాకు ఫస్ట్ కామిక్స్ కథలతో క్రిష్ అనే సూపర్ మ్యాన్ గా అలరించి ప్రతి భాషలో హృతిక్ సుపరిచితుడయ్యాడు.


అయితే క్రిష్ అనే మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ ని సాధించినప్పటికీ…ఈ మూవీని సక్సెస్ ను తరువాత కాలంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేకపోయారు. క్రిష్ చివరి సీక్వెల్ మార్కెట్ పరంగా కొంత మందిని నిరాశపరిచిందనే టాక్స్ బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే సౌత్ ఇండియన్ మూవీ..అందులోనూ ఓ తెలుగు మూవీ అయిన బాహుబలి2 ఇప్పుడు భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది.


ఇప్పుటి వరకూ ఈ మూవీ 1450 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇది కచ్ఛితంగా 1600 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అంటున్నారు. ఇక ఈ కలెక్షన్స్ ని చూసిన హృతిక్ రోషన్ ఒక్కసారిగా సంచలన కామెంట్స్ చేశాడు. “బాహుబలి2 మూవీ కలెక్షన్స్ అనేది ఊహించలేనిది. ఈ మూవీతో బాలీవుడ్ హీరోలు అంతా సిగ్గుపడాలి. ముఖ్యంగా నా మూవీలు“. అంటూ కామెంట్ చేయటం హాట్ టాక్స్ లా మారింది.


బాలీవుఢ్ మూవీలకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నప్పటికీ..ఎప్పుడూ ఈ విధమైన సక్సెస్ ని ఏ మూవీ చూడలేదు. కానీ బాహుబలి మూవీ మాత్రం ఒక్కసారిగా హాలీవుడ్ మార్కెట్ ని సైతం షేక్ చేసే విధంగా మారిందని అంటున్నారు. ఇక రాజమౌళి వంటి డైరెక్టర్ తో తనకు పనిచేయాలని ఉందని ఇండైరెక్ట్ గా హృతిక్ రోషన్ చెప్పుకురావటం అనేది బిటౌన్ మీడియాలో ఇది మరింతగా హల్ చల్ చేస్తుంది. మొత్తంగా బాలీవుఢ్ టాప్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ విధంగా మాట్లాడటంతో దీనిపై బిటౌన్ హీరోలు సైతం ఎటువంటి కామెంట్స్ చేయకపోవటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: