తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఈవీవీ సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ ‘అల్లరి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ లాంటి వారు తమ హవా కొనసాగించే వారు.  వారు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే సమయానికి మనోడు మంచి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  గత కొంత కాలంగా మనోడికి కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తున్నా..ప్రస్తుతం కామెడీ హీరోగా అల్లరి నరేష్ గుర్తుకు వస్తాడు.  తాజాాగా    అల్లరి నరేష్  నటిస్తున్న  చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక.
Displaying SAI_4734.JPG
మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ  పొలాచ్చిలో జరిగిన భారీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న మరో షెడ్యూల్ ఇది. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో 90శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటను త్వరలోనే పూరిచేసి జూన్ చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.  గమ్యం శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది.  
Displaying SAI_4545.JPG
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది అని  తెలిపారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.


మరింత సమాచారం తెలుసుకోండి: