తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వచ్చే రావడమే మాస్ ఇమేజ్ సంపాదించడు.  ఇక చత్రపతి చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్ పెరిగిపోయింది.  మిర్చి, డార్లింగ్ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలతో జాతీయస్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం ప్రభాస్ తో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఉవ్వళ్లూరుతున్నారు.  
Related image
అంతే కాదు ప్రభాస్ తో సినిమా తీయాలని బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఇక ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు చాలా బిజీ హీరోయిన్ గా మారింది.  అంతే కాదు ప్రయోగాత్మక పాత్రలో అనుష్క నటిస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేసింది.  
Image result for rudramadevi rana anushka
బాహుబలి చిత్రంలో ఇద్దరితో నటించారు..బాహుబలి, భల్లాల దేవ మరి ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అన్న ప్రశ్నకు..బాహుబలి బాహుబలే..భల్లాల భల్లాలే..ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే అంటోంది దేవసేన అనుష్క. అయితే ఇద్దరిలో ఎవరు సెక్సీ అన్న ప్రశ్నకు మాత్రం తడుముకోకుండా ప్రభాసే అని మనసులోని మాట చెప్పేసింది. మరి భల్లాల..అదే... రానా మాటో అని అడిగితే హీ ఈజ్ లైక్ మై బ్రదర్ అని కుండబద్దలు కొట్టింది. తనను రానా అలా సిస్టర్ లా భావిస్తాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: