ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని చేస్తున్న వారిలో ఇద్దరు ప్రముఖంగా ఉన్నారు. ఒకరు డైరెక్టర్ రాజమౌళి అయితే..మరొకరు కథా రచయిత విజయేంద్రప్రసాద్‌. విజయేంద్రప్రసాద్‌ కథలు ఇప్పుడు ఇండియన్ బాక్సాపీస్ ని షేక్ చేస్తున్నారు. తను ఏదైనా కథని అందించారు అంటే అది కచ్ఛితంగా నిర్మాతకిక కాసులు వర్షం కురిపించేది అవుతుందని అంటున్నారు.


ఆ  విధంగా విజయేంద్రప్రసాద్‌ తాజాగా తన డైరెక్షన్ లో ఓ సినిమాని తెరకెక్కించారు. ‘‘పెద్ద హీరోలతో సినిమా చెయ్యాలంటే ఇమేజ్‌ చట్రం అడ్డొస్తుంది. ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చినా అది చేదుగా ఉంటుంది. ఏదొక విషయంలో రాజీ పడక తప్పదు. దర్శకుడిగా నేను చెప్పాలనుకున్న కంటెంట్ తెరపై కనిపించాలంటే కొత్త ఆర్టి‌స్ట్ లు అయితే మంచిదని నా అభిప్రాయం. అందుకే కొత్తవారితో ఈ సినిమా చేశా’’ అని వి.విజయేంద్రప్రసాద్‌ మూవీ గురించి చెప్పుకొచ్చారు. 


 అయితే తన దర్శకత్వంలో వస్తున్న ఈ శ్రీవల్లీ మూవీకి కథా పరంగా కొన్ని న్యూడ్ సీన్స్ ఉన్నాయనే చర్ఛ ఇండస్ట్రీలో బలంగా జరుగుతుంది. విజయేంద్రప్రసాద్‌సైతం కథని కమర్షియల్ గా వర్కౌట్ చేసేందుకే ఈ న్యూస్ సీన్స్ ని పెట్టారని అంటున్నారు. దాదాపు రెండు నిముషాలు పాటు కథలో బాగంగా సాగే ఈ న్యూడ్ సీన్స్ చిత్రీకరణని విజయేంద్రప్రసాద్‌ చాలా తెలివిగా చిత్రీకరించారని అంటున్నారు.


ఈ చిత్రం లో రజత్‌,నేహ హింగే కీలక పాత్రధారులు. సైంటిఫిక్‌థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై చర్ఛలు జరుగుతున్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే…‘‘మనసుని చూడగలిగితే ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. దీనిపై ఓ ప్రొఫెసర్‌చేసిన ప్రయోగమే ఈ సినిమా’’ కథగా ఉండనుంది. మూడు భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: