బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్స్ ఓ స్టార్ డం స్థాయికి వచ్చినప్పుడు వీళ్ళు హీరోల కమాండ్స్ ని ఏ మాత్రం పట్టించుకోరు. ఇక టాప్ హీరోయిన్ గా ఎదిగారంటే ఎంతటి టాప్ హీరో అయిన సరే…హీరోయిన్ చెప్పింది వినాల్సిందే. ఇటువంటి సందర్భంలో టాప్ హీరోలకి, హీరోయిన్స్ కి మధ్య అప్పుడప్పుడు వార్ జరుగుతూ ఉంటుంది.


ఇందులో భాగంగానే ప్రియాంక చోప్ర, కత్రినాకైఫ్, దీపికాపదుకొనె, కంగనా రనౌత్‌ వంటి హీరోయిన్స్ చాలా సందర్భాల్లో టాప్ హీరోలను ఆ ఆట ఆడుకుంటారు. ఇందులో ముఖ్యంగా కంగనా రనౌత్‌ అయితే బిటౌన్ ఇండస్ట్రీ హీరోలను ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఓపెన్ గా తిట్టిన సందర్భాలు అనేకం. ఆ విధంగానే తాజాగా కంగనా రనౌత్‌ఓ టాప్ హీరోకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిన కంగనా రనౌత్‌ను ఇప్పడు లక్ష్మీబాయ్ కథాంశంతో ఓ మూవీని తెరకెక్కిస్తుంది. కంగనా కెరీర్ కు ఈ మణికర్ణిక మూవీ ఎంతో కీలకమని అంటున్నారు. ఇందులో తను లీడ్ రోల్ చేయటమే కాకుండా నిర్మాతగానూ భాగస్వామ్యం అయ్యారు. దీంతో మణికర్ణిక మూవీ లాభాలను తెస్తుందా? కెరీర్ ని ముంచేస్తుందా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.


ఇదిలా ఉంటే మణికర్ణిక మూవీలో రణ్ వీర్ సింగ్ కి ఓ రోల్ ఉంటుందని మొదట కంగనా చెప్పారంట. అయితే తరువాత రణ్ వీర్ సింగ్ కి కాకుండా ఆ రోల్ కి మరో హీరోయిన్ ఎంచుకుంది. దీంతో కంగనా రనౌత్‌పై రణ్ వీర్ సింగ్ ఘాటు కామెంట్స్ చేశారు. “కంగనా రనౌత్‌కి టేస్ట్ లేదు” అని అనటంతో “నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి” అంటూ రణ్ వీర్ సింగ్ పై స్ట్రయిట్ కామెంట్స్ ని చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: