యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. శ్రీరామనవమికి టైటిల్ లోగో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.


బ్లాక్ అండ్ బ్లాక్ లో తారక్ లుక్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుంది. ఇక పోస్టర్ కారులోంచి దిగుతూ కనిపించగా మరోటి చేతికి సంకెళ్లతో అదరిపోయింది. ఫస్ట్ లుక్ లో తారక్ ఇంటెన్స్ లుక్ సినిమా మీద మరింత అంచనాలను పెంచేసింది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న ఎన్.టి.ఆర్ మూడు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. ఫస్ట్ లుక్ అంచనాలను మించి ఉండగా ఇక టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అభిమానులకు పుట్టినరోజు గిఫ్ట్ అందించాడు తారక్.

మే 20న పుట్టినరోజు కానుకగా ఓ రోజు ముందే జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఈ లుక్ చూస్తుంటే తారక్ మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: