తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.  సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఉండటం..నటన, డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన ఎన్టీఆర్ గత మూడు సంవత్సరాలుగా వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు.  గత సంవత్సరం కొరటాశ శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్..సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు డాలితో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  

ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ‘జై లవకుశ’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.  అయితే పోస్టర్ విషయంలో మనోడి స్టైల్ లుక్స్ తో పాటు చేతికి బేడీలు ఉండటం చూస్తుంటే..ఇదేదో మరోసారి కోర్టకు సన్నివేశానికి రిలేటడ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.  ఆ మద్య టెంపర్ చిత్రంలో కోర్టు లో జరిగే సన్నివేశం సినిమాకు హైలెట్ గా నిలిచింది.  
Image result for ntr jai lava kusa first look
అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో మూడు పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారన్న ఆశలో ఉన్నారు ఫ్యాన్స్.   ఓకే గెటప్ కి సంబంధించి రెండు స్టిల్స్ లను వదిలారు ఆ చిత్ర బృందం . అయితే ఆ రెండు స్టిల్స్ లో కూడా ఎన్టీఆర్ రఫ్ లుక్ లో ఉన్నాడు పైగా నెగెటివ్ షేడ్ అన్న మాట ప్రకారం యాంటీ రోల్ లాగే కనిపిస్తోంది పైగా ఎన్టీఆర్ వెనకాల రావణాసురుడి గెటప్ కూడా ఉండటంతో  మనోడు విలనీజానికి కాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.
Image result for ntr jai lava kusa bobby
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే . అందులో రెండు పాత్రలు ఎలా ఉండనున్నాయోమో కానీ ఈ పాత్ర మాత్రం నెగెటివ్ పాత్ర అని తేలిపోయింది . బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీహెరాల్డ్.కామ్ టీమ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: