సినిమాలు ప్రజల మీద ఎంత ప్రభావితం చేస్తాయి అన్న దాని కన్నా స్మాల్ స్క్రీన్ లో వచ్చే సీరియల్స్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు అన్నది అందరికి తెలిసిన విషయమే. టికెట్ కొని చూసే సినిమా కన్నా రోజు వద్దాన్నా వచ్చే సీరియల్స్, రియాలిటీ షోలే ప్రేక్షకులకు ఎక్కువ టైం పాస్ ఇస్తుంటాయి.


అయితే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే క్రమంలో బుల్లితెర మీద బూతు కామెడీని పడిస్తూ అదేదో గొప్ప అన్నట్టు భావిస్తున్నారు టివి ఛానెళ్లు. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం ఏదన్నా అంటే పంచ్ అంటూ సమర్ధించుకోవడం వారికి అలవాటుగా మారింది. బుల్లితెర మీద ఈ షోలకు టి.ఆర్.పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తున్నా వాటిని చూసి విసుగు చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.


సరదాగా మిమ్మల్ని నవ్వించడానికే ఈ ప్రోగ్రామ్స్.. ఎవరిని ఉద్దేశించినవి కాదని ప్రోగ్రాం ముందు ఓ కార్డ్ వేసినా ఏ ఎపిసోడ్ లో ఎలాంటి బూతు బాగోతం వినాల్సి వస్తుందో అని ఆడియెన్స్ కంగారు పడుతున్నారు. తమని అడిగేవారే లేరని ఎపిసోడ్ ఎపిసోడ్ కు వారు శృతిమించుతున్నారని తెలుస్తుంది.  అంతేకాదు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు యూట్యూబ్ వ్యూయర్షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది.      


ఆరోగ్యకరమైన కామెడీని అందించే ప్రోగ్రామ్స్ కన్నా యూత్ ఆడియెన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కే ఎక్కువ అలవాటు పడటంతో ఒక ఛానెల్ కు మించి మరో ఛానెల్ ఇలాంటి అసభ్యకరమైన ప్రోగ్రాంస్ తో విసుగుతెప్పిస్తున్నారు. సినిమాల్లో కాస్త హాట్ నెస్ ఎక్కువైతే సెన్సార్ కట్ చేసినట్టు బుల్లితెరకు అలాంటి సెన్సార్ స్క్రూటిని ఏదన్నా ఉంటే బాగుంటుంది లేదంటే బూతులు వినలేక చెవులు చిల్లులు పడేలా ఉన్నాయ్ అని ఓ వర్గం ప్రేక్షకులు తమ అభిప్రాయం వెళ్లబుచ్చుతున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: