‘బాహుబలి 2’ తో దేవసేనగా అనుష్క జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. దీనీతో ఆమె పై బాలీవుడ్ మీడియా ఫోకస్ కూడ చాలా ఎక్కువ అయింది. ‘బాహుబలి 2’ సినిమాకు సంబంధించి  తెరపైన వారిమధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పండింది అని వార్తలు రాస్తున్న బాలీవుడ్ మీడియా   వ్యక్తిగతంగా వారిమధ్య అఫైర్ జోరుగా నడుస్తోంది అంటూ తెగ రూమర్లు  ప్రచారంలోకి తీసుకు వస్తోంది. 

ఈ నేపధ్యంలో బాలీవుడ్ మీడియాలో వస్తున్న రూమర్లను చూసి అనుష్క మనస్తాపానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య ప్రముఖ బాలీవుడ్ సైట్ అనుష్క ప్రభాస్ లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కథనాన్ని కూడ ప్రచురించింది. 

మరోక బాలీవుడ్‌ సైట్ ఒక ప్రముఖ నిర్మాతతో అనుష్క రిలేషన్ కొనసాగిస్తున్నది అందుకే సినిమాలు ఒప్పుకోవడం తగ్గించుకొంటున్నది అని స్టోరీ రాసింది. అయితే మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలకు రూమర్లకు చెక్ పెడదామని అనుష్క తన దగ్గర ఉన్న వ్యక్తి గత సిబ్బందిని తొలిగించినా ఈ రూమర్లు ఇలాగానే వస్తూ ఉండటం అనుష్కకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు  టాక్. 

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రతారగా గుర్తింపు పొందిన అనుష్క పై రూమర్లు, గాసిప్స్ రావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆమె పెళ్లి పై అనేక కథనాలు వెలువడ్డాయి. ఆర్యతో అఫైర్ ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  దీనితో ఈ గాసిప్పులకు విసిగిపోయిన అనుష్క విహారయాత్ర కోసం థాయ్‌లాండ్‌ కు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తానూ  పనిచేసే ప్రతి స్టార్‌ తో అఫైర్ అంటగట్టడం బాధగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచురించడం భావ్యంకాదు అని అనుష్క తాజాగా జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.  

అంతేకాదు ఇలాంటి రూమర్లను ప్రస్తుతం చాలా లైట్‌గా తీసుకుంటున్నట్లు చెప్పి మరో ట్విస్ట్ ఇచ్చింది. అయితే అనుష్క ప్రభాస్ సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోలను మాత్రం కొందరు సోషల్ మీడియాలో పెట్టి కొందరు చేస్తున్న ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా అనుష్క తన పెళ్లి విషయాన్ని ప్రకటించే వరకు ఇటువంటి గాస్సిపులకు అడ్డుకట్ట పడదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: