రీసెంట్ గా వచ్చిన బాబు బాగా బిజీ సినిమాలో నటించిన సుప్రియ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఓర చూపులతో సినిమాలో ఆమె చేసిన ఆంటీ పాత్ర అబ్బో అదిరిపోయిందంటే నమ్మాల్సిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హంటర్ రీమేక్ గా వచ్చిన బాబు బాగా బిజీ సినిమా తెలుగులో ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.


సినిమాలో అందరికి రిజిస్టర్ అయిన క్యారక్టర్ ఆంటీదే. సుప్రియ చేసిన ఆ పాత్ర ఓ రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యింది. కేవలం చూపులతోనే హాట్ అప్పీల్ చేసిన అమ్మడు అవసరాల శ్రీనివాస్ తో చేసిన అదరచుంభనం ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తో పాటు ట్రైన్ దిగి వచ్చే చిన్న సీన్ లో నటించిన సుప్రియ బాబు బాగా బిజీలో ప్రముఖ పాత్ర చేయడం గొప్ప విషయమే. 


ఇక సినిమా ఫ్లాప్ అయినా సరే తనకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక వచ్చే అవకాశాలు కూడా సెక్సీ ఆఫర్స్ రావడం ఆమెకు తలనొప్పిగా మారింది. సెక్సీ హీరోయిన్ గా చేస్తానేమో కాని అడల్ట్ సినిమాలు మాత్రం చేసేది లేదని ఆమె వచ్చిన అవకాశాలను సైతం కాదనేస్తుందట. బాబు బాగా బిజీ ఒక్క సినిమాతో అమ్మడు సూపర్ క్లిక్ అయ్యింది.


అడల్ట్ సినిమాలు వద్దు అంటుంది కాని తనని హీరోయిన్ గా ఎలాగైనా వాడుకోండని మాత్రం హింట్ ఇస్తుంది సుప్రియ. మొత్తానికి ఎలాంటి ఐడెంటిటీ లేని ఈ భామ ఒక్క సినిమాతో క్రేజీ ఆంటీగా మారడం ఓ పక్క లక్ అని చెప్పేలా ఉన్నా మరో పక్క మాత్రం పాపం అనిపించక తప్పట్లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: