Image result for hemamalini the dream girl

మన సమాజం లో స్త్రీల పట్ల పురుషులలో ఉన్న దృక్పథం లోనే పెద్ద దోషం ఉంది. తల్లిదండ్రులు పెంపకం లోనే ఆ దోషాలకు బీజం పడుతుంది. పురాణాలు ఇతి హాసాలు చెపుతూ సబలను అబలను చేసిన ఈ సమాజం సహస్రాబ్ధాలుగా స్త్రీ జాతిని పరిహసిస్తూనే ఉంది. జన్మకు జననే ఆధారం. స్త్రీ జన్మ కే కాదు పురుష జన్మకూ ఆమే జన్మ స్థానం.


ఆమె నుండి జన్మించిన ఈ మగ మహారాజుకు మగతనం ప్రకోపించి మదమెక్కి జన్మ స్థానం మీదే నిత్యం  లైంగిక దాడులు చేస్తూ అనైతికకు మార్గం సుగమం చేసాడు. సమాజమంతా ఈ దుర్మార్గం వ్యాపించటానికి తోటి మగువలూ సహాయం చేస్తూ నే ఉన్నారు. మగువ కు హాని జరిగిన ప్రతి చోట మరో మగువ సహకారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంటూనే ఉంది.


ఈ పాపప్రకోపం సమాజమంతా నిండి ఉన్నా సినిమా రంగములో దీనికి అవకాశాలు అనంతం అనిర్వచనీయం. ముదిమి వయసు మీద పడుతున్నా చెదరిని సౌదర్యం హేమమాలిని సొంతం. ఆమె పేరు బంగారం ఆమె దేహం బంగారం. అమే భారతీయుల కలల సామ్రఙ్జి, స్వప్నసుందరి.

Image result for hema malini in gautamiputra satakarni

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఆమె ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు సంచ‌ల‌నంగా మారాయి. “ఈ రోజుల్లోనూ త‌న వ‌య‌సు న్న తార‌లతో  బాలీవుడ్ లో ఎవ‌రూ సినిమాలు తీయాల‌ని అనుకోవ‌టం లేద‌ని, అయితే ఇప్ప‌టికీ త‌మ భుజాల మీద సినిమాను మోయ‌గ‌ల‌మ‌న్నారు” హేమమాలిని.


వ‌య‌సును కార‌ణంగా చూపించి అవ‌కాశాలు ఇవ్వ‌కుండా ముఖం చాటేసే బాలీవుడ్  నిర్మాత దర్శకుల మనస్థత్వాన్ని అందులోని నిఘూఢ మర్మాన్ని ప్రశ్నించకనే వేలెత్తి మరీ చూపించారు హేమమాలిని.  ఆ విచిత్ర వైనాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు, అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నించిన  సీనియ‌ర్ న‌టి హేమ‌మాలిని మాట‌లు ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారాయి. పెద్ద వ‌య‌సులో ఉన్న తార‌ల్ని సినిమాల్లో నటింపచేయక పోవటానికి  కార‌ణం ఇటీవ‌ల వినిపిస్తున్న క‌థ‌నాలేనా?  సూటిగా, సుతిమెత్తగా అతి సున్నితంగా అసభ్యాన్ని కూడా అతి సభ్యతగా ప్రశ్నించిన తీరు సర్వదా ప్రశంశనీయం.  అదే ఇప్పుడు బాలీవుడ్‌ను ఉలిక్కిప‌డేలా చేస్తోంది.

Image result for raai laxmi
మాలాంటి వాళ్ల‌ను ఎందుకు తీసుకోవ‌టం లేదు? ప‌్ర‌ముఖ పాత్ర‌ల్లో వృద్ధ తార‌ల్ని ఇప్ప‌టి ప్రేక్ష‌కులు చూడ‌టం ఇష్టం లేదా? మ‌మ్మ‌ల్ని తీసుకోవ‌టం ద‌ర్శ‌క, నిర్మాత‌ ల‌కు ఇష్టం లేదా? వృద్ధ వ‌య‌సులో ఉన్న వారిని తీసుకోక‌పోవ‌టానికి కార‌ణం ఏమిటి?  అంటూ సూటిగా అడిగేశారు అనేకంటే కడిగేశారు అనటం కరక్ట్. ఏడు దశాభ్దాల వయసులో ఐదు దశాబ్ధాల పరిణితి చెందిన నటనానుభవం మరచిపోయారా? అని ప్రశ్నిస్తున్న ఆమె అంతరంగం వద్దన్నా కూడా బయటపడుతూనే ఉంది  


ఈ నాడు సినిమాల్లో అవకాశలకు "స్త్రీలు శృంగారాన్ని పరివర్తకం" గా (బార్టర్ లేదా వస్తుమార్పిడి) గా ఇవ్వవలసి వస్తుందని వాపోతున్నారు, అనెకమంది యువ నటీ మణులు. ఇక్కడ నటన కోసం ఎవరూ పరితపించటం లేదు. ఇక్కడి మగమహారాజు లు శృంగారం కోసమే తపించి తహతహ మంటున్నట్లు ఇటీవల రాయ్ లక్ష్మి లాంటి పుష్కర అనుభవమున్న నటీ మణులే చెపుతున్నారు. హీరోయిన్లను నిర్మాతలు, దర్శకులు, హీరోలు సరదాల కోసం వాడుకుంటారని వ్యాఖ్యానించింది. షికార్లకు, పడకింటికి కూడా తీసుకెళ్తారని, ఒకవేళ అందుకు నో చెబితే, సినిమాల నుంచి తప్పిస్తారని కూడా ఈమె తేల్చేసింది. కేవలం కొత్త వాళ్లకే కాదు.. స్టార్ లుగా ఎదిగిన వారికి కూడా అలాంటి అనుభవాలే ఎదురవుతా యని ఈ నటీమణి చెప్పడం గమనార్హం.


సినీ పరిశ్రమలో “కాస్టింగ్ కౌచ్” (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం)  గురించి గత కొంత కాలంగా పెద్ద చర్చే నడుస్తోంది. పడగ్గదికి వస్తే తప్ప అవకాశాలు ఇవ్వ బోమంటూ దర్శక నిర్మాతలు తమను లొంగదీసుకు నే ప్రయత్నం చేశారంటూ ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆరోపించారు. హేమమాలిని దీన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.


హేమమాలిని చెప్పినట్లు శృంగారమే ప్రధానంగా సాగే అవకాశాల కల్పనలో నటనకు అనుభవానికి విలువ యివ్వక వయసులో ఉన్నారా? లేదా ? అనేదే ప్రాధమ్యత సంతరించుకోవటం సినిమా రంగంలో విపరీత పోకడలకు దారితీస్తుంది. సినిమాలలో అవకాశం లభించాలంటే మహిళల తమతో శృంగారాన్నే వినిమయం చేసే వాతా వరణం నేడే కాదు నాడూ ఉంది.


రావూరి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళు తెలుగు నవల-సినిమాలో కథానాయికల ఇతర నటీమణులు పడే అగచాట్లు వెతల చుట్టూ నడచిన ఆ గ్రంధానికి జ్ఞానపీఠ్ అవార్డ్ కూడా లభించింది.


ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో వనితలకు అవకాడాలకూ - వారి నుండి కాంక్షించే శృంగారానికి మంచి లింకు ఉంటుందన్న విష‌యాన్ని ప‌లువురు న‌టీ మ‌ణులు బహిరంగంగానే ఆరోపిస్తుండ‌టం జరుగుతూనే ఉంది. శృంగారానికి సరే అంటేనే నటించే అవకాశాలు ఇస్తున్నార‌న్న విష‌యాన్ని బాలీవుడ్ న‌టీమ‌ణుల‌తో పాటు రీసెంట్ గా రాయ్ లక్ష్మీ తో సహా పదుల సంఖ్యలో సైతం "మీరు పడక పై ఛాన్స్ ఇస్తే మేం నటనకు ఛాన్స్" ఇస్తామంటున్నారంటూ అస‌లు విష‌యాన్ని దాపరికం లేకుండా చెప్పేయ‌టాన్ని మనం గమనించాలి.  


ముస‌లోళ్లు అయిన మ‌గ‌వారిని ఎంతకాలమైనా హీరోలుగా నటిస్తూనే ఉంటారు. కానీ మ‌హిళ‌ల్ని మాత్రం ఒక వ‌య‌సు దాటిన‌త‌ర్వాత ఎందుకు తీసుకోరు? అంటూ అనుష్క శ‌ర్మ ఈ మ‌ధ్య‌నే ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.


అయితే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ మాతృమూర్తి గౌతమీగా నటించిన డేబ్బై యేళ్ల హేమమాలిని-బాలకృష్ణ కన్నా, అందులోని వాశిష్టీ పాత్ర పోషించిన శ్రేయ  కన్నా అందంగా చాలా మిసిమి చాయలో రాజసం ఉట్టిపడేలాగా కనిపించారు. ఆమెలోని “గెయిటీ” ముందు గవదలుజారి, చర్మం ముడతలు పడి, చేదండలు నేలను చూస్తున్న ఏభై యేళ్ళ బాలకృష్ణ తేలిపోయారు. గొంతులో తెచ్చుకున్న గాంభీర్యత తప్ప నిజమైన స్వచ్చమైన మాధుర్యం వినిపించలేదు.


మొత్తానికి "ఏజ్ ఫ్యాక్ట‌ర్" ను బ‌య‌ట‌కు తీసి కొత్త చ‌ర్చ‌కు హేమ‌మాలిని తెర తీశార‌ని చెప్పాలి.  

Image result for hemamalini the dream girl

మరింత సమాచారం తెలుసుకోండి: