Image result for bahubali 2 vs dangal

భారతీయ సినీ వినీల చలనచిత్ర ఆకాశంలో జాబిల్లిలా మరో ఐదేళ్ళైనా బాక్స్ ఆఫీస్ వసూళ్ళ పరంగా ప్రకాశిస్తుంది అని అను కున్న "బాహుబలి ది కంక్లూజన్" తన ప్రాభవాన్ని కోల్పోయే దిశగా దంగల్ పరుగు మరోసారి మొదలైంది చైనాలో. రోజుకు మిలియన్ డాలర్ల వసూళ్ళతో సినిమా పండితులకే చెమటలు పట్టిస్తుంది. ఈ పరుగు ఇప్పటికి 21/12/2016 న విడుదలైన దంగల్ సినిమా 14/05/2017 వరకు విశ్వవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలు వసూల్ చేసి చరిత్ర లిఖించింది. 05/05/2017 న చైనా లో 9000 స్క్రీన్స్ పై విడుదలైన దంగల్ ఇప్పటికే 500 కోట్ల రూపాయలు వసూళ్ళు సాధించి చైనాలో 65వ అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి వారం లోనే 200 క్రోర్ రూపీ మార్క్ దాటేసింది. 16 రోజుల్లో 600 కోట్లకు పైగా చైనాలో కలక్షన్లు సాధించింది. 


దీన్ని బట్టి దంగల్ మొత్తం వసూళ్ళు 1400 కోట్ల రూపాయలుగాను, బాహుబలి 1500 కోట్ల రూపాయలు గా నేటివరకు నమోద య్యాయి. కాని దంగల్ ఒక్క చైనాలోనే $100 మిలియన్ డాలర్లు పైగా వసూలు చెసే అవకాశాలని కొట్టివేయలేమంటున్నారు సిని పండితులు.  

Related image

ఇప్పటి వరకూ బాహుబలి 2 రికార్డ్స్ సునామీకి పాత రికార్డ్స్  అన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. విడుదలైన తొలిరోజు నుండే కలెక్షన్స్ కింగ్‌గా నిలుస్తూ,  దేశ విదేశాల్లోనూ దుమ్ములేపుతూ తన దమ్ము చూపింది బాహుబలి 2 ది కంక్లూజన్.   ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి తొలిత 1000 కోట్లు , ఆతరువాత 1500 కోట్లను కొల్లగొట్టి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ పేజీకెక్కింది.


అయితే విడుదలైన మూడు వారాల్లో 1500 కోట్లను కొల్లగొట్టడం అంటే సాధారణమైన విషయం కాదని,  ఇప్పట్లో ఈ రికార్డ్స్‌ను బ్రేక్ చేసే సినిమా రాకపోవచ్చునని మార్కెట్ పండితులు అంచనా వేశారు. అయితే వీరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఆమిర్ ‘దంగల్’ మూవీ తన కొత్తపరుగును చైనాలో ప్రారంభించింది. వసూళ్ళవరద సుడులు తిరుగుతూ దూసు కొస్తుంది.

Image result for bahubali 2 vs dangal

చైనాలో ఇటీవల విడుదలైన రోజు నుండి ‘దంగల్’ మూవీ ప్రతి రోజూ సగటున మిలియన్ డాలర్లను కొల్లగొడు తూ బాహుబలికి దడ పుట్టిస్తుంది. ఇప్పటికే తొంభై మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువైన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన పరదేశీ చిత్రం గా రికార్డుల కెక్కింది. ఈ కలెక్షన్స్ వరద ఇలా కంటిన్యూ అయితే దంగల్ చైనాలో వంద మిలియన్ డాలర్లను ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా. దీంతో ఒక్క చైనాలో వెయ్యికోట్లు గ్రాస్‌ను దంగల్ క్రాస్ చేయడం పక్కా అని మార్కెట్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.


ఇప్పటికే దంగల్ మూవీ చైనా వసూళ్లతో కలిపి మొత్తంగా 1400 కోట్ల గ్రాస్‌ను సాధించటంతో, బాహుబలి ది కంక్లూజన్  మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన 1500 కోట్ల రికార్డుని బీట్ చేసేందుకు కొన్ని కోట్ల దూరంలో మాత్రమే ఉంది. అయితే బాహుబలి ది కంక్లూజన్ నాలుగో వారం కలెక్షన్స్ బట్టి దంగల్ బీట్ చేసేది లేనిది తేలనుంది.అయితే ఇండియన్ బిగ్గెస్ట్ హిట్‌గా ప్రపంచ స్థాయిలో జెండా పాతేసిన బాహుబలి ది కంక్లూజన్  రికార్డ్స్‌కు ఇంత త్వరగా దెబ్బ కొట్టటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Image result for bahubali 2 vs dangal

అయితే ఇండియాలో బాహుబలి 2 ది కంక్లూజన్ నెలకొల్పిన రికార్డ్స్‌ను ఇప్పట్లో టచ్ చేయడం అంత ఈజీ కాదు. అప్పటి వరకూ ది కింగ్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ ఇండియన్ మూవీగా బాహుబలి 2 ది కంక్లూజన్ ఉండనే ఉంటుంది.  తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడు  ఎప్పుడూ సిద్దంగా  ఉంటాడనే తెలుగు సామెత "బాహుబలి 2 ది కంక్లూజన్  వర్సెస్ దంగల్" సినిమాతో మరోసారి ఋజువౌతుంది. 

Image result for bahubali 2 vs dangal 

Day Wise Collections of  Dangal in China (ATP – Average Ticket Price).

First Week

  • Friday – 2.34 Million (ATP 4.15 $, 30245 Shows, 547415 Footfalls/Admissions)
  • Saturday – 4.69 Million (ATP 4.33 $, 32421 Shows, 1084752 Footfalls/Admissions)
  • Sunday – 5.56 Million (ATP 4.37 $, 35778 Shows, 1271182 Footfalls/Admissions)
  • Monday – 3.04 Million (ATP 4.29 $, 37952 Shows, 708951 Footfalls/Admissions)
  • Tuesday – 3.55 Million (ATP 4.35 $, 43438 Shows, 814869 Footfalls/Admissions)
  • Wednesday – 3.96 Million (ATP 4.33 $, 47121 Shows, 915574 Footfalls/Admissions)
  • Thursday – 3.95 Million (ATP 4.36 $, 46933 Shows, 907761 Footfalls/Admissions)

Second Week

  • Friday – 6.44 Million (ATP 4.44 $, 36022 Shows, 1449864 Footfalls/Admissions)
  • Saturday – 14.07 Million (ATP 4.47 $, 55629 Shows, 3145374 Footfalls/Admissions)
  • Sunday – 13.01 Million (ATP 4.24 $, 65229 Shows, 3070799 Footfalls/Admissions)
  • Monday – 5.02 Million (ATP 4.42 $, 63656 Shows, 1135348 Footfalls/Admissions)
  • Tuesday– 4.72 Million (ATP 4.42 $, 66765 Shows, 1067466 Footfalls/Admissions)
  • Wednesday –4.22 Million (ATP 4.43 $, 68018 Shows, 952390 Footfalls/Admissions)
  • Thursday – 3.79 Million (ATP 4.44 $, 68459Shows, 852368 Footfalls/Admissions)

Third Week

  • Friday– 5.99 Million (ATP 4.24 $, 45857 Shows, 1354352 Footfalls/Admissions)
  • Saturday(* still running)  – 9.8 Million
  • Total (till now) – 94.4 Million USD  (608.48 crore)

మరింత సమాచారం తెలుసుకోండి: