దర్శకుడు బాబి చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి అంటూ పవన్ అభిమానులు దర్శకుడు బాబీ పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పవర్’ వంటి కమర్షియల్ సక్సస్ తో కెరీర్ ను ఆరంభించిన దర్శకుడు బాబీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో దారుణ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 

అయితే అటువంటి ఘోరమైన ఫెయిల్యూర్ వచ్చిన తరువాత కూడ బాబీకి జూనియర్ లాంటి టాప్ హీరో అవకాశం ఇవ్వడం సంచలనంగా మారడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను  త్రిపాత్రాభినయంలో చూపిస్తూ “జై లవ కుశ” సినిమాను తీస్తూ ఉండటంతో ప్రస్తుతం బాబీ  ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. ఇది ఇలా ఉండగా నిన్న జూనియర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీర్ పుట్టినరోజు వేడుకలకు అతిథిగా వచ్చిన బాబీ చేసిన కామెంట్స్ వెనుక అర్ధం ఏమిటి అన్నకోణంలో ప్రస్తుతం టాలీ వుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

ఈ సమావేశంలో బాబీ చేసిన ప్రసంగం ఆద్యంతం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ సాగింది. తెలుగు నాట తారక్ జన్మించడం అదృష్టమని అంటూ గత 47 రోజులుగా రెండవ టేక్ అడుగుదామంటే అవకాశం ఇవ్వకుండా జూనియర్ ‘జై లవ కుశ’ లో నటిస్తున్నాడు అంటూ జూనియర్ పై ప్రశంసలు కురిపించాడు బాబీ. అయితే ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లడుతూ “సెట్స్ కు నవ్వుకుంటూ రావడం తన పని మాత్రమే తను చూసుకోవడం తప్ప ఇతరుల పనుల్లో వేలు పెట్టడం గానీ చూడడం గానీ జూనియర్ కు ఏమీ ఉండవు” అని బాబి చెప్పగానే అక్కడున్న అభిమానులంతా ‘జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్’ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు అని వార్తలు వస్తున్నాయి.

అయితే బాబీ చేసిన ఈ కామెంట్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయా? అంటూ కొందరు అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం బాబీ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో బాబీకి స్వేఛ్చ లభించలేదని అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నారని అందుకే సినిమా ఆ స్థాయిలో వచ్చిందన్న ప్రచారం జరిగిన నేపధ్యంలో ప్రస్తుతం బాబీ చేసిన కామెంట్స్ ఆ విషయాలను తిరిగి గుర్తు చేసేవిగా ఉన్నాయి అన్నది పవన్ అభిమానుల అభిప్రాయం. 

దీనితో ఈ కామెంట్స్ విని పవన్ అభిమానులు బాబి పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే బాబి యధాలాపంగా జూనియర్ అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి అన్న కామెంట్స్ వెనుక లేనిపోని అర్ధాలు పవన్ అభిమానులు అనవసరంగా వెతుకుతున్నారు అంటూ మరికొందరు కామెంట్  చేస్తున్నారు .ఏమైనా బాబి అనుకోకుండా చేసిన కామెంట్స్ తో పవన్ అభిమానుల మధ్య ఇరుకున పడ్డాడు అని అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: