ఇండియన్ ఫిలిం రికార్డులను క్రియేట్ చేసిన ‘బాహుబలి 2’ హవాకు ఈ వారంలోనే గండి పడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ కలక్షన్స్ వేగానికి చెక్ పెడుతూ ప్రస్తుతం చైనాలో పరుగులు తీస్తున్న ‘దంగల్’ మూవీ నిన్నటి రోజుతో 1400 కోట్లు మార్క్ రీచ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరో 100 కోట్లు కలెక్ట్ చేస్తే ‘బాహుబలి-2’ తో సమానంగా ‘దంగల్’ కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ లో 1500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే మరో వంద కోట్ల రూపాయలు సాధించడం ‘దంగల్’ సినిమాకు కేవలం ఒకటి రెండు రోజుల పని మాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద ఇంకో పెద్ద సినిమా బరిలో లేకపోవడం కూడా దంగల్ కు పరిస్థుతులు అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్క చైనా మార్కెట్ లోనే అమీర్ ఖాన్ “దంగల్” 1000 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం బలపడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇదే జరిగితే ‘దంగల్’  2000 కోట్లు కలక్షన్స్ అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు మొన్నటి శనివారం వరకు ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 1538 కోట్లు వసూలు చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ‘దంగల్’ కలక్షన్స్ వేగంతో పోల్చుకుంటే ‘బాహుబలి 2’ వేగం బాగా తగ్గింది. 

నిన్నటి రోజున చైనాలో ‘దంగల్’ కు మరో 100 కోట్లు రావడం ఖాయం అని అంటున్నారు. దీనితో ఈ గురువారానికి ‘దంగల్’ ‘బాహుబలి 2’ ను క్రాస్ చేయడమే కాకుండా ఆ మూవీ అందుకోలేని రికార్డులను ఏర్పరుస్తుంది అని అంటున్నారు. అయితే ఇండియాలో ‘బాహుబలి 2’ నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసే మరో సినిమా రావడానికి మరో కొంత కాలం పట్టే ఆస్కారం ఉంది. ఏమైనా చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ కు ఎదురీత మొదలైంది అనే అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: