తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొంత మది నటీనటులు మాట్లాడుతున్న మాటతీరు చూస్తుంటే..ఎంత ఘోరంగా ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతగా హల్ చల్ చేస్తున్నాయో చెప్పనక్కరలేదు.  స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్న ఆలీ తన సహనటులు, యాంకర్లపై ఎలాంటి వ్యంగాస్గ్రాలు వేస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే పలువురు యాంకర్లపై ద్వందార్థాలతో మాట్లాడి వారిచే తిట్లు కూడా తిన్నారు.  భారత దేశంలో ఆడవారంటే ఎంతో గౌరవం ఇస్తారు..ఇక ఆడవారి గురించి సెలబ్రెటీలు ఉపన్యాసాలు దంచి కొడుతుంటారు.  
Image result for Rarandoi Veduka Chuddam Movie Audio Launch
అలాంటిది ఓ సెలబ్రెటీ..సీనియర్ నటులు ఆడవాళ్ళని ఘోరంగా అవమానించాడు.  ఇంతకీ ఆ నటులు ఎవరా అంటారా..ఒకప్పుడు విలన్ వేషాలు వేస్తూ ఇప్పుడు తాతయ్య, తండ్రి పాత్రల్లో నటిస్తున్న చలపతిరావు.   సుదీర్ఘ మైన చరిత్ర ఉన్న చలపతిరావు మొదటి నుండి ఆడవాళ్ళ పైన , హీరోయిన్ లపైన ప్రతీసారి అవమానకర భాషలో మాట్లాడుతూ ఉంటాడు.  తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం వేడుకలో కూడా అమ్మాయిలపై అవమానకర కామెంట్స్ చేసి మరింత సంచలనం సృష్టించాడు .
Image result for Rarandoi Veduka Chuddam Movie Audio Launch
అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారని కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.  యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సినియర్ నటుడు చలపతి రావు అమ్మాయిల పట్ల మాట్లాడిన తీరు చూసి అంత పెద్ద నటుడు అయి ఉండి ఇలా నీచంగా మాట్లాడుతారా అని  నెటిజన్లు చలపతిరావు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికి కూడా షూటింగ్ లొకేషన్ లో ఆడవాళ్ళ పై బూతులు విసురుతూ నవ్వుకుంటూ వాళ్ళని అవమానానికి గురి చేస్తున్నాడు ఈ నటుడు . ఇంత వయసు వచ్చినా బుద్ది లేదా అంటూ బూతులు తిడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: