మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాపై టైటిల్ దగ్గర నుండి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్ లుగా నిలుస్తున్నాయి.


నిన్న మొన్నటిదాకా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఇప్పుడు ఏకంగా ఆ సినిమా కథ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా ఓ రివెంజ్ స్టోరీగా రాబోతుందట. తండ్రి మరణానికి కారణమైన వారిమీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథట. 


అంతేకాదు తండ్రికి ఇద్దరు భార్యలుంటారట. పవన్ రెండో భార్య కొడుకని.. కుటుంబ సంబంధాల గురించి కూడా మరోసారి త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుందట. ఆగష్టు కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమాను ఫుల్ స్పీడ్ గా లాగించేస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.


మరి అసలు స్టోరీ ఇదేనా లేక మరేదైనా ఉంటుందా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. త్రివిక్రం లైన్ ఎంత రొటీన్ గా ఉన్నా సరే ఆయన పెన్ పవర్ తో రాసే డైలాగులు వాటికి తగ్గ సన్నివేశాలు అదిరిపోతాయి. ఈ కాంబినేషన్ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: