చిన్న సినిమాలతో హీరోయిన్ గా ప్రస్థానం కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంటుంది. ఓ పక్క స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడు కుర్ర హీరోలతో కూడా జోడి కడుతుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో రకుల్ చేసిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం మూవీ ఈ శుక్రవారం రాబోతుంది.


ఈ సినిమాలో భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ తన కెరియర్ లో ఇలాంటి క్యారక్టర్ చేయడం మొదటిసారని.. ఇప్పటిదాకా చేసిన సినిమాల పేర్లు చెప్పమంటే ఆలోచిస్తానేమో కాని ఈ భ్రమరాంబ పాత్ర మాత్రం సెకన్ లో గుర్తొస్తుందని అంటుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ పాత్రని మలచిన తీరు తనని బాగా ఇంప్రెస్ చేసిందని చెబుతుంది రకుల్ ప్రీ సింగ్. 


అందుకే కళ్యాణ్ కృష్ణకి తానో వార్నింగ్ ఇచ్చానని అంటుంది రకుల్. తను తీసే తర్వాత సినిమాలో కూడా హీరో ఎవరైనా సరే హీరోయిన్ గా తననే తీసుకోవాలని చెప్పిందట. సో దీన్ని బట్టి రకుల్ భ్రమరాంబ పాత్రకు ఎంత కనెక్ట్ అయ్యిందో అర్ధమవుతుంది. ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున సినిమా చాలా బాగా వచ్చిందని ముఖ్యంగా రకుల్ అదరగొట్టిందని అన్నాడట.


నాగ్ లాంటి సూపర్ స్టార్ తన గురించి మాట్లాడటం సంతోషాన్నిచిందని అంటుంది రకుల్. ఈ క్రమంలోనే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఏ సినిమా చేసినా సరే తననే హీరోయిన్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మరి అమ్మడి కోరిక డైరక్టర్ తీరుస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: