ప్రస్తుతం మీడియా మరీ చైతన్యం అయిపోవడంతో ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే చాలు ఆ విషయాన్ని తెలియని వారికి కూడ తెలిసేలా చేసి గంటల తరబడి హడావిడి చేస్తూ ఆ విషయాన్ని హైలెట్ చేసి తమ రేటింగ్స్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సందర్భమే ఈరోజు ఉదయం నుండి నటుడు చలపతిరావు ఒక ఆడియో ఫంక్షన్ లో స్త్రీల పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ అనేక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా ఊహించని విధంగా ఈ వ్యవహారానికి సమంతను లింక్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ‘1 నేనొక్కడినే’ సినిమా పోస్టర్ పై ఘాటైన కామెంట్స్ చేసి అప్పట్లో మహిళలకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరుతెచ్చుకున్న సమంత చలపతిరావు కామెంట్స్ పై ఎందుకు స్పందించలేదు అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాదు ఇలాంటి విషయాల పై ఎప్పుడూ ఘాటుగా స్పందించే మంచులక్ష్మి కూడ ఇంతవరకు ఏమి మాట్లాడక పోవడం ఆశ్చర్యం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా చలపతిరావు ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఈ ఆడియో ఫంక్షన్ లో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ తన పక్కన కూర్చున్న నాగచైతన్యతో నవ్వుతూ కనిపించడం మరింత ఆశ్చర్యకరంగ ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయమై అనేక కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఝాన్సీ ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది.  సెలెబ్రెటీలు ఒక ఫంక్షన్ లో మాట్లాడేడప్పుడు ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడిన సందర్భాలు గతంలో ఎన్నో జరిగాయి అనీ అయితే ఇప్పుడు చలపతిరావు వ్యవహారంతో అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేసింది. 

ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం చలపతిరావు వ్యాఖ్యల పై అనేక మహిళా సంఘాలు తమ నిరసనను తెలియచేస్తూ చలపతిరావు పై పోలీసు స్టేషన్ లో కేసులు కూడ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. చలపతిరావు మీడియా ముందుకు వచ్చి క్షమార్పణలు చెప్పినా ఇప్పటికీ నేటి సమాజంలో స్త్రీల పై అసభ్య పదాలు జారవిడిచే ఎందరో సెలెబ్రెటీలు ఇంకా ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ..  


మరింత సమాచారం తెలుసుకోండి: